Home » Heavy Rains
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఇది శనివారం ఉదయం పుదుచ్చేరి (కారైక్కాల్) - మహాబలిపురం మధ్య తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ చెన్నై(Chennai) ప్రాంతీయ కేంద్రం అంచనా వేసింది.
ఫెంగల్ తుపాను ఈరోజు పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత 7 రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొంది.
శ్రీలంక- తమిళనాడు మధ్య ఏర్పాడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్గా బలపడే అవకాశముంది. ఇది ఉత్తర తమిళనాడు, మహాబలిపురం మధ్య నవంబర్ మాసాంతంలో తీరం దాటే అవకాశముంది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ‘ఫెంగల్’ అనే ఈ తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడు(Tamil Nadu)లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫానుగా రూపుదిద్దుకోనున్న వాయుగుండం ప్రభావం కారణంగా నగరంలో మంగళవారం ఉదయం కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమైనా తేలికపాటి జల్లులే కురిశాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ పరిశోధన మండలి హెచ్చరించడంతో ఆరు జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
దేశానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు గత 18 గంటలుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఇది మంగళవారం తుఫాన్గా మారే అవకాశముందని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 25వ తేదీనాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగా రాష్ట్రంలోని కోస్తాతీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.