Share News

Visakhapatnam: ఇండిగో విమానాలు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు

ABN , Publish Date - Oct 29 , 2024 | 08:27 PM

చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో.. ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా పలు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఎయిర్ పోర్ట్‌లకు బెదిరింపులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Visakhapatnam: ఇండిగో విమానాలు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు

విశాఖపట్నం, అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతొంది. ఆ క్రమంలో మంగళవారం చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులను కిందకి దింపి భద్రతా సిబ్బంది ఆయా విమానాల్లో తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎక్కడ ఏ విధమైన పేలుడు పదార్ధాలు లభ్యం కాకపోవడంతో విమానాశ్రయ అధికారులతోపాటు ప్రయాణికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: CM Chandrababu: గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు


ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టేషన్ మేనేజర్‌కు సాయంత్రం 05:38 గంటలకు బాంబు బెదిరింపు ట్వీట్ అందింది. దీంతో విమానాశ్రయ అధికారులకు స్టేషన్ మేనేజర్ అప్రమత్తం చేశారు. అయితే ఆడమ్ లామ్‌జా 202 ఐడీ నుంచి ట్వీట్ వచ్చినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది.

అయితే ఈ రెండు విమానాలకు సెక్యూరిటీ క్లియరెన్స్ లభించింది. దీంతో బోర్డింగ్‌ను ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో మూడు గంటల ఆలస్యంగా ఇండిగో విమానాలు బయలుదేరి గమ్యస్థానాలకు పయనమవనున్నాయి.

Also Read: జగన్ చెల్లికి అన్యాయం చేయకు..! విజయమ్మ లేఖ..


ఇటీవల కాలంలో దేశంలో పలు విమానయాన సంస్థలకు వరుస పెట్టి బాంబు బెదిరింపులు వస్తున్నాయి. సోమవారం హైదరాబాద్- విశాఖ-ముంబై విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్పటికే హైదరాబాద్ నుంచి ముంబయికి విమానం టేకాఫ్ అయి 10 నిమిషాల అయింది. దీంతో ఆ విమానాన్ని మళ్లీ హైదరాబాద్ విమానాశ్రయానికి అధికారులు వెనక్కి రప్పించారు. ప్రయాణికులను కిందకి దింపి.. భద్రతా సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చివరకు విమానంలో బాంబు లేదని నిర్ధారించుకున్నారు. అయితే ఈ బాంబు బెదిరింపులతో దాదాపు మూడున్నర గంటల అలస్యంగా సదరు విమానాన్ని ముంబయికి బయలుదేరి వెళ్లింది.

Also Read: Deepavali 2024: దీపావళి వేళ.. జస్ట్ ఇలా చేయండి చాలు..

Also Read: Dhantrayodashi 2024: ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది

Also Read: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు


దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విమానాశ్రయ అధికారులే కాదు.. ప్రయాణికులు సైతం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సైతం ఈ బాంబు బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

Also Read: అడిగిన దానికి సమాధానం చెప్పు.. పోలీస్ పై రఘునందన్ రావు ఫైర్

Also Read: వామ్మో.. సూర్య నమస్కారాలతో ఇన్ని లాభాలున్నాయా..?

For AndhraPradesh News And Telugu News...

Updated Date - Oct 29 , 2024 | 08:38 PM