Home » Jasprit Bumrah
భారత్, ఐర్లాండ్ మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. నేటి మ్యాచ్‌లోనూ గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తొలి ఓవర్లోనే బుమ్రా తన బౌలింగ్‌లో పదునుతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. . తొలి ఓవర్లోనే బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. దీంతొో కెప్టెన్‌గా ఆడుతున్న తొలి టీ20లోనే రెండు వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా రీ ఎంట్రీకి వరుణుడు అడ్డుతగిలేలా కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్ జరగనున్న డబ్లిన్‌లో శుక్రవారం భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 92 శాతం వర్షం పడుతుందని నివేదిక ఇచ్చింది. దీంతో ఇప్పటికే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
కరీబియన్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్(Five T20 series) ముగిసిందో.. లేదో క్రికెట్ ప్రేమికులకు మరోసారి వినోదాన్ని పంచేందుకు టీమిండియా (Team India) సిద్ధమవుతోంది.
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా వెన్నుగాయం తీవ్రం కావడానికి గల కారణాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విలక్షణ బౌలింగ్ శైలి కారణంగానే బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం అతడి గాయానికి శృంగారమే కారణమని ఆరోపిస్తున్నారు. ఆరంభంలో వెన్ను గాయం రికవరీలో భాగంగా ఇంటికే పరిమితమైన బుమ్రా పూర్తిగా గాయం నయం కాకముందే సతీమణితో అసహజ శృంగారం చేయడం వెన్ను గాయం తిరగబెట్టేలా చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఐర్లాండ్‌లో టీమిండియా పర్యటన శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, ఐర్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో యువ జట్టుతో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Captain Hardik Pandya)తోపాటు ఇతర సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఐర్లాండ్(Ireland)తో జరిగే టీ20లకు ఏస్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా(Jasrpeet Bumrah) టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.
15 ఏళ్లుగా టీ20లు జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క బౌలర్ కూడా ఈ ఫార్మాట్లో టీమిండియాకు నాయకత్వం వహించలేదు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 10 మంది భారత్‌కు సారథ్యం వహించారు. అందులో ఒక్క స్పెషలిస్ట్ బౌలర్ కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో టీ20ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న తొలి స్పెషలిస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు.
టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై ఏడాది కాలం కావొస్తుంది. అయితే బుమ్రా గాయం నుంచి దాదాపుగా కొలుకున్నాడని త్వరలోనే జట్టులోకి వస్తాడని ఈ మధ్య పలు జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై స్వయాన బుమ్రానే స్పందించాడు.
టీమిండియాకు గుడ్ న్యూస్. గాయాల కారణంగా కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), శ్రేయస్ అయ్యర్ త్వరలోనే భారత జట్టులో చేరనున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో (National Cricket Academy in Bengaluru) కోలుకుంటున్న వీరిద్దరు దాదాపుగా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లుగా సమచారం అందుతోంది. ఈ క్రమంలోనే బుమ్రా, శ్రేయస్ వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్ (Ireland) పర్యటనలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.