Share News

Jasprit Bumrah: బుమ్రా క్రేజీ రికార్డ్.. ఇంకో ఐసీసీ అవార్డ్ లోడింగ్..

ABN , Publish Date - Dec 06 , 2024 | 07:18 PM

Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. ఆ ఫీట్ నమోదు చేసిన ఒకే ఒక్కడిలా నిలిచాడు. మరి.. ఆ రికార్డు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: బుమ్రా క్రేజీ రికార్డ్.. ఇంకో ఐసీసీ అవార్డ్ లోడింగ్..

IND vs AUS: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు రికార్డులు నమోదు చేయడం, పాత రికార్డులకు పాతర వేయడం అలవాటుగా మారింది. మూడు ఫార్మాట్లలోనూ కన్‌సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్న బుమ్రా.. ఇప్పటికే ఎన్నో క్రేజీ రికార్డులు క్రియేట్ చేశాడు. తోపు బౌలర్లకు సాధ్యం కాని రేర్ ఫీట్స్ కూడా అందుకున్నాడు. అలాంటోడు మరో మైల్‌స్టోన్‌ను రీచ్ అయ్యాడు. అడిలైడ్ టెస్ట్‌లో ఇది చోటుచేసుకుంది. మరి.. బుమ్రా సాధించిన ఆ రికార్డు ఏంటి? ఇంతకుముందు ఆ ఫీట్ ఎవరైనా అందుకున్నారా? అనేది ఇప్పుడు చూద్దాం..


లెజెండ్స్ సరసన..

పింక్ బాల్ టెస్ట్‌లో బుమ్రా అరుదైన ఘనత అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన పేసుగుర్రం.. ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఒకే ఒక్క బౌలర్‌గా నిలిచాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో లాంగ్ ఫార్మాట్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకముందు లెజెండ్ కపిల్‌దేవ్, వెటరన్ పేసర్ జహీర్ ఖాన్ ఈ ఫీట్ నమోదు చేశారు. కపిల్‌దేవ్ 1979 క్యాలెండర్ ఇయర్‌లో 74 వికెట్లు, 1983లో 75 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్ 2002లో 51 వికెట్లు పడగొట్టాడు.


కమిన్స్ తర్వాత మనోడే

కపిల్‌దేవ్, జహీర్ ఖాన్ లాంటి దిగ్గజాల సరసన బుమ్రా చోటు దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో అతడు మరో రికార్డు కూడా సృష్టించాడు. 2019 తర్వాత గత ఐదేళ్లలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. 2019లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ 50కి పైగా వికెట్లు తీశాడు. అతడి తర్వాత ఈ ఐదేళ్లలో మరే పేసర్ కూడా ఈ మార్క్‌ను అందుకోలేకపోయాడు. తాజాగా బుమ్రా ఈ క్రేజీ ఫీట్ అందుకొని ఔరా అనిపించాడు. అతడి బౌలింగ్ చూసిన నెటిజన్స్.. ఇంకో ఐసీసీ అవార్డ్ లోడింగ్ అని అంటున్నారు. ఇక, అడిలైడ్ టెస్ట్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు డే1 ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మెక్‌స్వీనీ (38 నాటౌట్), మార్నస్ లబుషేన్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు.


Also Read:

లబుషేన్-సిరాజ్ ఫైట్.. కంగారూ బ్యాటర్‌‌పై మియా సీరియస్

U19 Asia Cup 2024: 13 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ విధ్వంసం.. ఫైనల్స్‌కు టీమిండియా

ఒకేరోజు 12 మంది క్రికెటర్ల బర్త్‌డే.. బుమ్రా, జడ్డూ సహా లిస్ట్‌లోని స్టార్లు వీళ్లే..

For More Sports And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 07:21 PM