Rohit Sharma: ఇదేం పని.. పిచ్చి పట్టిందా.. రోహిత్‌పై భారత మాజీ క్రికెటర్ సీరియస్
ABN , Publish Date - Dec 11 , 2024 | 01:31 PM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ మాజీ క్రికెటర్ సీరియస్ అయ్యాడు. పిచ్చి పట్టిందా.. అదేం నిర్ణయమంటూ ఫైర్ అయ్యాడు. మరి.. హిట్‌మ్యాన్‌ను ఆ ప్లేయర్ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కష్టకాలంలో ఉన్నాడు. పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత టీ20లకు గుడ్‌బై చెప్పేసిన హిట్‌మ్యాన్.. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఈ రెండు ఫార్మాట్లలో ఇంకొన్నేళ్లు ఆడదామని అనుకుంటున్నాడు. కానీ ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ముఖ్యంగా లాంగ్ ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ వీడ్కోలు చెప్పడం ఖాయమని వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా టెస్టుల్లో అటు బ్యాటర్‌గా, ఇటు సారథిగా ఫెయిల్ అవడమే దీనికి కారణం. న్యూజిలాండ్ సిరీస్ వైట్‌వాష్‌తో అతడిపై మొదలైన విమర్శల పరంపర.. అడిలైడ్ టెస్ట్ ఓటమితో పీక్స్‌కు చేరుకుంది. హిట్‌మ్యాన్ నిర్ణయాలు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి.
రెస్ట్ అవసరమా?
పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా విషయంలో రోహిత్ వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సీరియస్ అయ్యాడు. బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో హిట్‌మ్యాన్ అతి జాగ్రత్తకు వెళ్లడం కరెక్ట్ కాదన్నాడు. మ్యాచ్ విన్నర్‌కు రెస్ట్ ఇవ్వాలనుకోవడం పిచ్చి ఆలోచన అని ఫైర్ అయ్యాడు. ఆ ఆలోచనే రావొద్దన్నాడు. ఆల్రెడీ బుమ్రాకు కావాల్సినంత విశ్రాంతి ఇచ్చారని.. కీలక మ్యాచులకు కూడా అతడికి రెస్ట్ ఇవ్వాలనుకోవడం సరికాదన్నాడు మంజ్రేకర్. రోహిత్ బ్యాటింగ్ మీదా అతడు విమర్శలు గుప్పించాడు.
ఎలాగైనా ఆడించాలి
‘గత మూడేళ్ల కాలంలో టీమిండియా ఆడిన మ్యాచుల్లో కేవలం 34 శాతం వాటిల్లోనే బుమ్రా పాల్గొన్నాడు. దీన్ని బట్టి అతడికి ఎంత రెస్ట్ దొరికిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భారత జట్టుకు అతడి అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి అతడ్ని ఇక మీదట ఆడే ప్రతి మ్యాచులోనూ ఆడించాలి. ఈ సిరీస్‌లో రాణిస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బుమ్రాను తప్పనిసరిగా బరిలో దింపాలి. కావాలంటే ఏదైనా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రెస్ట్ ఇవ్వాలి’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కాగా, రెండో టెస్ట్ ఓటమితో బీజీటీలో 1-1తో సమంగా ఉంది భారత్. అయితే పింక్ బాల్ టెస్ట్‌లో బుమ్రా గాయపడటంతో అతడి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ అన్నాడు. దీంతో బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం ఖాయమనే పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే హిట్‌మ్యాన్‌ను టార్గెట్ చేసుకొని ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు మంజ్రేకర్. అతడ్ని పక్కనబెట్టాలనేది పిచ్చి నిర్ణయమని మండిపడ్డాడు.