Minister: మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:59 PM
మా బండి నిండిపోయింది.. ఆ ఎమ్మెల్యేలను ఏం చేసుకోవాలి అంటూ.. మంత్రి సతీశ్‌జార్కిహొళి పేర్కొనడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశమైంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై మంత్రి ఇప్పుడు ఇలా మాట్లాడడం కన్నడ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

- మంత్రి సతీశ్ జార్కిహొళి
బెంగళూరు: మా కాంగ్రెస్ బండి నిండుగా ఉందని, 18మంది జేడీఎస్ ఎమ్మెల్యేలను తీసుకుని ఏం చేయాలని ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్‌జార్కిహొళి(Minister Satish Jarkiholi) అన్నారు. బెంగళూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓవర్‌లోడ్ అయినా... ఇక్కడివారే కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రస్తుతానికి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నామని, ఇక్కడే వేచి ఉంటామన్నారు. తాను ఆర్‌ఏసీ కోటాలో ఉన్నానని, కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కుంటే తమకు అవకాశం రావచ్చునన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు
ఎవరెన్ని చెప్పినా ఇక్కడ ఏక్‌నాథ్‌శిండే, అజిత్‌పవార్‌లు లేరని, ఆ సామర్థ్యం ఇక్కడ ఎవరికీ లేదన్నారు. మంత్రి రాజణ్ణ హనీట్రాప్ కేసు వేరని, ఎమ్మెల్సీ రాజేంద్రపై హత్యాయత్నం కుట్ర వేరన్నారు. శాసనసభ సమావేశాలు ముగిశాక మంత్రి రాజణ్ణను కలవలేదన్నారు. రాష్ట్రంలో దళిత సమావేశం జరిగినప్పుడు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సుర్జేవాలా వస్తారన్నారు. రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ను కలిశానన్నారు.
అభివృద్ధి చర్చలకే కేంద్రమంత్రులతో భేటీ
అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రులను కలిశానని రాజకీయ చర్చలు లేవని మంత్రి జార్కిహొళి అన్నారు. కేంద్రమంత్రులు కుమారస్వామి, సోమణ్ణను కలిశానన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడతో కలవడం అకస్మికమన్నారు. పార్లమెంటుకు వెళ్లే మార్గంలో దేవెగౌడ కార్యాలయం ఉందని అక్కడే కలిశానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైడ్రా, మూసీ పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు..
పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం.. డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..
Read Latest Telangana News and National News