Home » Karimnagar
రాష్ట్రంలో బీసీ గణన చేసి 42శాతం విద్య,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లకు తీర్మానం చేసిన తెలంగాణ వైపు యావత్ దేశం చూస్తుందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పం చాయతీ కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మంగళ వారం మండల కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాల యం ఎదుట సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వ హించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు సీపెల్లి రవీందర్ మాట్లాడుతూ జీఓ 51ను సవరించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించిన ప్రభుత్వం ఇక నుంచి మీసేవ కేంద్రాల్లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా నేరుగా దరఖాస్తులు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది.
మొక్కజొన్న రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో చేతికి వచ్చిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వరదలతో వానాకాలంలో చాలా మంది మొక్కజొన్న రైతులు నష్టపోయారు. కొన్ని చోట్ల రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు.
చిన్నారుల నుంచి పెద్దపిల్లల వరకు అద్దాలతోని పాఠశాలలు, కాలేజీలకు పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు. ఏ తరగతి గదికి వెళ్లినా కొందరు పిల్లలైనా అద్దాలతో కనిపిస్తారు. సర్వేంద్రియాల్లో కళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చూపు లేకపోతే మనిషి నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నది. అన్నిరంగాల్లో ఏఐ వినియోగం అనివార్య మైంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఏఐని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థుల్లో యేటా అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోవడం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
వివిధ సమస్యలతో ప్రజావాణికి వచ్చే వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, దరఖాస్తులు పెం డింగ్‌లో ఉండకుండా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులను స్వీకరించారు.
రామగుండం పట్టణంలోని 20వ డివిజన్ ఏరియాలో గల గురుకుల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సందర్శించారు. ఎమ్మెల్యే పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
రాజ్యాంగ పరిర క్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జైబాపు, జైభీం, జైసంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఐతరాజుపల్లి నుంచి భూపతిపూర్ వరకు సోమవారం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాద యాత్ర నిర్వహించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. సోమ వారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు.