Home » Lakshman
బీఆర్ఎస్(BRS) కాళ్ల బేరానికి వచ్చినా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉండబోదని బీజేపీ(BJP) ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంగళవారం భైంసాలో విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్‌ను దగ్గరకు రానివ్వమన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్తో తమ పార్టీకి పొత్తుండదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఒక చచ్చిన పాము అని.. బీఆర్ఎస్ ఇక మీదట బతికి బట్టకట్టే పరిస్థితుల్లో లేదన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. తమ పార్టీకి10 సీట్లు, 35శాతం ఓట్లు వస్తాయన్నారు. ఏపీలో పవన్ కల్యాణ్ తో పొత్తు ఉందన్నారు. టీడీపీతో పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బీసీలకు అన్యాయం చేస్తున్నారని జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు బండారు లక్ష్మణ్ ( Bandaru Lakshman ) అన్నారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో బీజేపీ బీసీ సామజిక చైతన్య సభ నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... బీసీల ఓట్లతో గద్దెనెక్కిన సీఎంలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బండారు లక్ష్మణ్ మండిపడ్డారు.
టీటీడీ నిధుల మళ్లింపుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman ) డిమాండ్ చేశారు. టీటీడీ అక్రమాలపై గురువారం నాడు రాజ్యసభలో లక్ష్మణ్ లేవనెత్తారు. ఎన్నికల్లో లబ్ధి కోసం టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌కు విడుదల చేస్తోందని చెప్పారు.
తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( MP Laxman ) అన్నారు. శనివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఏపీలో రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కే ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తిరుమల వెంకన్న నిధులు పక్కదారి పడుతున్నాయని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తోడు దొంగలని.. ఎంఐఎం కబంధ హస్తాల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర అగ్ర నాయకులతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేలా పలు ప్రణాళికలను రచించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను తెలంగాణలో పర్యటించేలా పలు పధకాలు రెడీ చేసింది.
జనసేన పార్టీ ( Janasena party ) తో సీట్ల సర్దుబాటు రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.