Hyderabad: మేడ్చల్ వరకు మెట్రో రైలు కావాలి
ABN , Publish Date - Nov 06 , 2024 | 10:00 AM
మేడ్చల్ వరకు మెట్రో రైల్(Metro Rail) కావాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేసింది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్ శామీర్‌పేట్ ప్రాంతాలకు మెట్రో రైలు పొడిగించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మంగళవారం బోయిన్‌పల్లి(Boinpally)లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద ప్లకార్డులు, ప్లెక్సీలు పట్టుకుని నిరసన చేపట్టారు.
- బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద నిరసన
హైదరాబాద్: మేడ్చల్ వరకు మెట్రో రైల్(Metro Rail) కావాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేసింది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్ శామీర్‌పేట్ ప్రాంతాలకు మెట్రో రైలు పొడిగించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మంగళవారం బోయిన్‌పల్లి(Boinpally)లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద ప్లకార్డులు, ప్లెక్సీలు పట్టుకుని నిరసన చేపట్టారు. ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ.. గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు వస్తున్నట్లు తెలుసుకున్న మేడ్చల్ సాధన సమితి ప్రతినిధులు కేంద్రం వద్దకు చేరుకుని మేడ్చల్ వరకు మెట్రో రైలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తులం బంగారం ఎప్పుడిస్తారో చెప్పాలి..
ఈ సందర్బంగా సాధన సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళామని, నగరంలోని వివిధ ప్రాంతాలకు మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించాలని నిర్ణయించినప్పటికీ మేడ్చల్(Medchal)కు మాత్రం మెట్రో రైలు పొడిగించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు ఎన్ని ప్లైఓవర్లు వేసినా రహదారులను విస్తరించినా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదని అన్నారు.
ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య తొలగాలన్నా ఉత్తర భాగంలో నివశిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలన్నా మెట్రో ఒక్కటే మార్గమని తెలిపారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు మహేందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, జార్జ్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: అయ్యోపాపం. ఎంతఘోరం.. పాఠశాల గేటు పడి విద్యార్థి దుర్మరణం
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో కులగణన.. దేశానికి నమూనా
ఈవార్తను కూడా చదవండి: Medical Student: అయ్యా.. నాది ఏ రాష్ట్రం?
ఈవార్తను కూడా చదవండి: Uttam: కేంద్ర నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు!
Read Latest Telangana News and National News