Home » MLC Kavitha
MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్(Tihar) జైల్లో ఉన్న కవిత(MLC Kavitha).. మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును(Rouse Avenue Court) ఆశ్రయించారు. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఆమె తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో కవితకు..
Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. నేటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరిచారు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును సీబీఐ కోరింది. ఈ క్రమంలో తొమ్మిది రోజుల పాటు అంటే ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే...14 రోజులు కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ రిమాండ్ అప్లికేషన్లో పలు అంశాలను ప్రస్తావించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని అందులో పేర్కొంది.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court). లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో..
ఢిల్లీ మద్యం కుంభకోణం కుట్రదారులలో ఎమ్మెల్సీ కవితే ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని నిరూపించేలా సీబీఐ విచారణ జరుగుతోంది...
‘‘కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు.. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు.. నేను పిల్లులు, కుక్కలను కొట్టను. కొడితే పులినే కొడతాను’’ అని సీఎం రేవంత్ రెడ్డి ‘ఇండియా టీవీ’ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాడినని.. అందుకు కుర్చీయే (అధికారమే) అవసరం లేదని చెప్పారు.
Telangana: ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అవకాశం ఉంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా సీబీఐ పేర్కొంది...
రైతులు కష్టపడి పండించే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న కవితను మూడు రోజులు కస్డడీకి తీసుకుని విచారించేందుకు సీబీఐకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది....
దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (BRS MLC Kavitha) న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.