Home » Myanmar
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Earthquake in Myanmar: వరుస భూకంపాలు మయన్మార్‌ను వణికిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. మరోసారి భూకంపం సంభవించింది.
వరుస భూకంపాలతో కుదేలైన మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకు వచ్చింది. భూకంప ధాటికి విలవిల్లాడుతున్న మయన్మార్‌కు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధం అయ్యింది. ఇందుకోసం ఆపరేషన్ బ్రహ్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు భూవిలయంతో బాధపడుతున్నాయి. వరుస భూకంపాలతో రెండు దేశాల్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇరు దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌కు ఆపన్నహస్తం అందించేందుకు ఇండియా రంగంలోకి దిగింది.
శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్, థాయ్‌లాండ్ దిశగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 191 మంది మరణించారు, 800 మందికి పైగా గాయపడ్డారు. భారత్, బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి
మాండలేలోని రోడ్లు భారీ ఎత్తున పగుళ్లు తీయడం, హైవేలు తీవ్రంగా దెబ్బతినడం, వంతెనలు కుప్పకూలడంతో రెస్యూ ఆపరేషన్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భూకంప తాకిడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో క్షతగ్రాతుల తక్షణ చికిత్స కోసం అవసరమైన బ్లడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందంటూ వార్తలు వస్తున్నాయి.
మయన్మార్‌లో భూకంపాల కారణంగా బ్యాంకాక్‌లో భారీగా భూప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో తెలుగు ఎమ్యెల్యే తన ఫ్యామిలీతో టూరులో ఉన్నారు. అదృష్టం బాగుండి ఆయన కుటుంబం భూకంపం బారి నుంచి తప్పించుకున్నారు.
Earthquake In Myanmar And Thailand: మయన్మార్ దేశంలో వచ్చిన రెండు వరుస భూకంపాల కారణంగా థాయ్‌లాండ్‌లో ఓ ఎత్తైన భవనం కుప్పకూలిపోయింది. ఇండియా, బంగ్లాదేశ్, చైనాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Myanmar Earthquake Updates: మయన్మార్, బ్యాంకాక్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భారత్, చైనాలో భారీ భూప్రకంపనలు సంభవించాయి. ప్రధానంగా మయన్మార్, బ్యాంకాక్, థాయ్‌లాండ్‌లో భూమి ఎక్కువగా కంపించింది. భూకంపం తీవ్రతకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ చాలా భయానకంగా ఉన్నాయి.
మయన్మార్‌లో సంభవించిన భూకంపం తీవ్రత థాయ్‌లాండ్‌ను కుదిపేసింది. భూకంప తీవ్రతకు బ్యాంకాక్‌లోని బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.