Myanmar Earthquake: మయన్మార్ భూకంపం విధ్వంసం.. వందల కొద్దీ శవాలు
ABN , Publish Date - Mar 29 , 2025 | 09:45 AM
మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు భూవిలయంతో బాధపడుతున్నాయి. వరుస భూకంపాలతో రెండు దేశాల్లో భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇరు దేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌కు ఆపన్నహస్తం అందించేందుకు ఇండియా రంగంలోకి దిగింది.

భూకంప తీవ్రతకు మయన్మార్ కకావికలం అయ్యింది. సాగయింగ్ సమీపంలో 7.7 మ్యాగ్నిట్యూడ్‌తో వచ్చిన భూకంపం ధాటికి మయన్మార్ విలవిల్లాడింది. వరుసగా వచ్చిన ఆరు భూకంపాలు మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను భయ కంపితులు చేశాయి. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు పేక మేడల్లా కుప్ప కూలిపోయాయి. వందల మంది చనిపోయారు.. వేల మంది శిథిలాల కింద చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, ఆర్మీ ముమ్మర సహాయక చర్యల్లో నిమగ్నం అయి ఉన్నాయి. ఈ భూవిలయంలో సుమారు 700 మంది వరకు మరణించారని.. 1670 మంది వరకు గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. అంతేకాక భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది.
భూవిలయంతో బాధపడుతున్న మయన్మార్‌ను ఆదుకోవడం కోసం భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్‌కు ఆపన్న హస్తం అందించింది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ ప్రజలకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. 15 టన్నుల ఉపశమన పదార్థాలు అనగా ఆహారం, మందులు, జనరేటర్లు, దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, హైజీన్ కిట్లు వంటి అత్యవసరాలను మయన్మార్‌కు తరలించింది.
థాయ్‌లాండ్‌లో భూకంపం నేపథ్యంలో.. అక్కడ ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చారు. వారంతా కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. భూకంపం నేపథ్యంలో మయన్మార్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంప తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కుప్ప కూలిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మయన్మార్, థాయ్‌లాండ్ భూకంప తీవ్రతను తెలిపే వీడియోలు, ఫొటోలే కనిపిస్తున్నాయి.
భూకంప తీవ్రతకు.. మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్ వంతెన, పలు ప్రాంతాల్లో ఉన్న ఎత్తైన ఆలయాలు, గోపురాలు కుప్పకూలాయి. అలానే మయన్మార్ రాజధాని నేపిడాలోని ప్రధాన రహదారులన్ని దెబ్బతిన్నాయి. థాయ్‌లాండ్‌లో కూడా ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భూప్రకంప ధాటికి.. ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోని నీరు కిందకు పడుతున్న వబ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరో చోట భారీ బిల్డింగ్ కూలడంతో.. సుమారు 100మందికి పైగా గల్లంతయ్యారు. ఇరు దేశాల్లోను సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
పిల్లలు ఫోన్‌కు ఎడిక్ట్ అవుతోంటే జాగ్రత్త.. ఈ బాలుడికి ఏమైందో చూస్తే షాక్ అవుతారు..
ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు