Home » Nagababu
వైసీపీ(YSRCP) ట్రాప్‌లో పడి జనసేన(Janasena)కు నష్టం చేసే పనులు చేయొద్దని పార్టీ నేతలకు జనసేన నేత నాగబాబు(Nagababu) హెచ్చరించారు. గురువారం నాడు తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో తిరుపతి జనసేన నేతలతో నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు జనసేన నేతలతో నాగబాబు ఈ ఎన్నికల్లో కీలక విషయాలపై చర్చించారు.
జనసేన (Janasena) నేత, సినీ నటుడు కొణిదెల నాగబాబు (Nagababu) రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనట్లే కనబడుతోంది. కొద్ది రోజుల క్రితం తాను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి కూడా అన్ని మార్గాలను సుగమం చేసుకున్నారు. కూటమిలో ఉన్న జనసేన - తెలుగుదేశం పార్టీ(టీడీపీ) - బీజేపీ నేతలను కూడా కలిసి తనకు మద్దతివ్వాలని కూడా నాగబాబు కోరారు. అయితే అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డైలాగ్‌లకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. నిన్న రాప్తాడు సభలో గ్లాస్ సింక్‌లో ఉండాల్సిందేనంటూ ఏపీ సీఎం జగన్ చేసిన విమర్శలపై నాగబాబు స్పందించారు.
Janasena Leader Nagababu: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన నేతలు సైతం దూకుడు పెంచుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. అధికార పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. తాజాగా అనకాపల్లిలో పర్యటించిన నాగబాబు.. స్థానిక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు.
విశాఖ: జనసేన పార్టీ నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విడుదల చేస్తున్న జాబితాపై స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఏడో జాబితా కాదు... లక్ష జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదని, జనసేన ఎన్ని అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు.
నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్(Kakani Govardhan) గ్రానైట్ అక్రమ తవ్వకాలు చేస్తూ రెచ్చిపోతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు(Konidela Nagababu) విమర్శించారు.
సాక్షిలో (Sakshi) రాసిన వార్తపై జనసేన నేత నాగబాబు (Janasena leader Nagababu) ఫైర్ అయ్యారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(cm jagan) దిట్ట అని జనసేన నేత కె.నాగబాబు(K. Nagababu) వ్యాఖ్యానించారు.
రాష్ట్రం కోసం పోటీ చేయకుండా నిస్వార్థంగా మద్దతుగా నిలిచారు. సినీ రంగంలో చిరంజీవి, రాజకీయ రంగంలో పవన్ కళ్యాణ్‌ను కోట్ల మంది ఆరాధిస్తున్నారు. సీనియర్లు, యువత కలిసి కార్యక్రమాలు చేయండి. ఏది సాధించాలన్నా అది యువతోనే సాధ్యం. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించండి.
టీటీడీ స్వయంపాలక క్షేత్రంగా ఉండాలనేది కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. ఆలయానికి చెందిన ఆస్తులన్నీ అందినంత వరకూ దోచుకుంటున్నారని విమర్శించారు.