Home » New Delhi
బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపింది. సీబీఐ ఫిర్యాదు, ఛార్జిషీట్లుపై ప్రత్యేక కోర్టు సుదీర్ఘ విచారణ జరిపిన అనంతరం ప్రత్యేక కోర్టు తాజా తీర్పు వెలువరించింది.
రాహుల్, ప్రియాంక డిసెంబర్ 4న సంభాల్ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుమతి నిరాకరించారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత రావాలని రాహుల్‌కు పోలీసులు సూచించడంతో ఆయన వెనుదిరిగారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారంనాడు విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల రెండో జాబితాలో సీలంపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా జుబైర్ అహ్మద్‌ను నిలబెట్టింది. దీంతో 24 గంటలు తిరక్కుండానే అబ్దుల్ రెహ్మాన్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
తన ఇంటి నుంచి రూ.3 కోట్లు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్టు స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని జైన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ది పొందేందుకు స్వరాజ్ ఈ ఆరోపణలు చేశారని అన్నారు.
ఆటోవాలాలకు రూ.10 లక్షల బీమా, పిల్లల పెళ్లిళ్లకు రూ.1 లక్ష సాయం అందిస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఆటో డ్రైవర్ నవ్‌నీత్ ఇంట్లో కేజ్రీవాల్, ఆయన భార్య నవనీత్ మంగళవారంనాడు లంచ్ తీసుకున్నారు.
ఒకే దేశం-ఒకే ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిపై ఏకాభిప్రాయం సాధించి, విస్తృత సంప్రదింపుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పంపాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెబుతున్నారు.
రాజ్యసభలో మాట్లాడేందుకు తమకు సమయం కేటాయించే విషయంలో జగ్దీప్ ధన్‌ఖఢ్ వివక్ష చూపుతున్నారని, తాము మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని విపక్ష నేతల అభియోగంగా ఉంది.
భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు.
కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన ఘటన ఇదే మొదటిసారి కాదు. 2016లో రాజస్థాన్‌లోని బికనెర్‌లో పర్యటించినప్పుడు ఆయనపై దాడి యత్నం జరిగింది. 2013లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు ఆయనకు కొత్తకాదు.
బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాకాండపై జైశంకర్ లోక్‌సభలో శుక్రవారనాడు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024 ఆగస్టు నుంచి హిందువులు, మైనారిటీలపై పలుమార్లు దాడులు జరిగిన ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పారు.