Hyderabad: అరుదైన శస్త్రచికిత్సతో చిన్నారికి కొత్త జీవితం
ABN , Publish Date - Jan 23 , 2025 | 06:43 AM
ఏడేళ్లుగా కంటినిండా నిద్రపోలేని బాలుడికి శస్త్రచికిత్స చేసిన నిమ్స్ వైద్యులు(NIMS doctors) ఇకపై ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం కల్పించారు. శ్వాస కూడా సరిగా తీసుకోలేని బాలుడు భవిష్యత్తులో హాయిగా ఆడుకునే భాగ్యం కల్పించారు.

- ఏడేళ్ల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం
హైదరాబాద్ సిటీ: ఏడేళ్లుగా కంటినిండా నిద్రపోలేని బాలుడికి శస్త్రచికిత్స చేసిన నిమ్స్ వైద్యులు(NIMS doctors) ఇకపై ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం కల్పించారు. శ్వాస కూడా సరిగా తీసుకోలేని బాలుడు భవిష్యత్తులో హాయిగా ఆడుకునే భాగ్యం కల్పించారు. క్రానియోసినోస్టోసిస్ కారణంగా తల ఆకారంలో ఇబ్బందులతో జన్మించిన కౌషల్‌కు అస్థిపంజర శస్త్రచికిత్సను నిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కిడ్నీ రూ.25 లక్షలు!
ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన సమావేశంలో నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌ఓడీ డా.పార్వతి(NIMS Plastic Surgery HOD Dr. Parvathi), డా.పరంజ్యోతి, డా. శఘున దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వికృతమైన తల ఆకారంతో జన్మించిన కౌషల్‌కు 6 నెలల వయస్సులో న్యూరో సర్జన్‌తో ఆపరేషన్ చేయించారు. అయినా తల అసాధారణ ఆకారంలో పెరిగి కళ్లు, మధ్యభాగం తగినంతగా పెరగకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. రాత్రిపూట అకస్మాత్తుగా ఆక్సిజన్ పడిపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు పెరిగాయి.
గత మూడేళ్లుగా సీపీఏపీ యంత్రం సాయంతోనే నిద్రపోతున్నాడు. ఈ నేపథ్యంలో బాలుడి తల్లిదండ్రులు నిమ్స్ వైద్యులను సంప్రదించారు. బాలుడి పరిస్థితిని పరిశీలించిన వైద్యుల బృందం ఈ నెల 7న యూఎస్ నుంచి వచ్చిన ప్లాస్టిక్ అండ్ పునర్మిర్మాణ శస్త్రచికిత్స విభాగానికి విజిటింగ్ ఫ్యాకల్టీ అయిన డా.డేవిడ్ ఎ స్టాఫెన్ బర్గ్ సహాయంతో నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌ఓడీ డా.పార్వతి ఆధ్వర్యంలో శస్త్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాలుడు యంత్రం లేకుండానే నిద్రపోతున్నాడని, వాయుమార్గంలో తగినంత పెరుగుదల, కంటి బంతికి తగినంత మద్దతు తర్వాత తాము అమర్చిన పరికరాన్ని తీసివేస్తామన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి
ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు
ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?
Read Latest Telangana News and National News