Home » Priyanka Gandhi
రానున్న లోక్ సభ ఎన్నికల్లో వారణాసి బరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తే, ప్రియాంక విజయం సాధిస్తారని శివసేన-యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది చెప్పారు. ఈ స్థానం నుంచి మోదీ రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే.
ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తప్పుపట్టారు. పాలక ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ఎంతోకాలం మనుగడ సాగించలేవని అన్నారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు భయమంటే తెలియదని అన్నారు.
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి నుంచి ఆయనపై ప్రియాంక పోటీ చేస్తే ఆమె గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు.
వారసత్వ రాజకీయాలు క్విట్ ఇండియా అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నినాదాలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రథమ కుటుంబం నుంచి మరో వారసురాలు రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలు 50 శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ‘అదానీ’ వ్యవహారం వాడీవేడీగా నడుస్తున్న విషయం తెలిసిందే! అదానీ ఆస్తులు అమాంతం పెరగడం, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ‘అదానీ’ సంస్థలపై..
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ (BRS) విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ను గద్దె దించి.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది...
సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరయ్యేందుకు మార్గం సుగమం కావడంతో ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ‘‘వస్తున్నా.. ప్రశ్నలు కొనసాగుతాయి’’ అంటూ ఆయన ఫొటోతో ఆ పార్టీ ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ ప్రథమ కుటుంబం ఇటీవల మహిళా రైతులతో ఆనందంగా గడిపింది. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసం పెళ్లివారి ఇల్లులా కళకళలాడింది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా గ్రామీణ మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేస్తూ, కలుపుగోలుగా మాట్లాడుతూ, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో (Congress party) జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేరిక మరింత ఆలస్యమవనుంది. కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించ తలపెట్టిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బహిరంగ సభ మరోసారి వాయిదా పడింది. భారీ వర్షాల ప్రభావంతో ఈ సభను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈనెల 20న జరగాల్సిన సభను 30కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.