Share News

Cellphone jammer: హీరో దర్శన్ వ్యవహారంతో ఇక.. కట్టుదిట్టంగా సెల్‏ఫోన్ జామర్లు...

ABN , Publish Date - Sep 03 , 2024 | 01:20 PM

నేర ప్రవృత్తితో దారుణాలకు పాల్పడినవారిని జైళ్లలోకి వేయడం సహజం. ఎంతటివారైనా అక్కడ కఠినమైన జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. చేసిన తప్పునకు జైళ్లలో పశ్చాత్తాపం కలగాలనేది ముఖ్య ఉద్దేశ్యం. జైళ్ల శాఖలో కొందరి నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం వంటి కారణాలతో దశాబ్దాలుగా జైళ్లు విలాసవంతమైన ప్రాంతాలుగా మారిపోతున్నాయి.

Cellphone jammer: హీరో దర్శన్ వ్యవహారంతో ఇక.. కట్టుదిట్టంగా సెల్‏ఫోన్ జామర్లు...

- జైళ్లలో యథేచ్ఛగా మొబైళ్ల వాడకంపై ప్రభుత్వం సీరియస్‌

- అధునాతన పరికరాల ఏర్పాటు

- ఐదేళ్లకు రూ. 11 కోట్ల వ్యయం

బెంగళూరు: నేర ప్రవృత్తితో దారుణాలకు పాల్పడినవారిని జైళ్లలోకి వేయడం సహజం. ఎంతటివారైనా అక్కడ కఠినమైన జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది. చేసిన తప్పునకు జైళ్లలో పశ్చాత్తాపం కలగాలనేది ముఖ్య ఉద్దేశ్యం. జైళ్ల శాఖలో కొందరి నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం వంటి కారణాలతో దశాబ్దాలుగా జైళ్లు విలాసవంతమైన ప్రాంతాలుగా మారిపోతున్నాయి. తరచూ జైళ్లలో మొబైల్‌, మద్యం, గంజాయితోపాటు ఇతరత్రా నిషేధిత వస్తువులు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. జైళ్లలో మొబైల్‌ నెట్‌వర్క్‌(Mobile network) లేకుండా చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలించడం లేదు. ఎంతోమంది విచారణ ఖైదీలు, శిక్షకు గురైనవారు మొబైల్‌ వాడకాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌తోపాటు ఏడు జైళ్లలో టవర్స్‌ ఆఫ్‌ ది హార్మోనిస్‌ సెల్‌ బ్లాకింగ్‌ సిస్టమ్‌ (టి-హెచ్‌సీబీఎస్) టెక్నాలజీకి అనుబంధమైన మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేశారు.

ఇదికూడా చదవండి: Tungabhadra: ‘శత’ వేగంగా.. తుంగభద్ర.. సాయంత్రానికల్లా...


వీటిని ఐదేళ్ల నిర్వహణకు రూ.11.32 కోట్లు విడుదల చేశారు. ఈ టవర్లు నిర్దేశించిన ప్రదేశంలో మొబైల్‌ సిగ్నల్స్‌ లభించకుండా పనిచేస్తాయి. వీటి నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఉగ్రవాద కార్యకలాపాలు, సంఘ విద్రోహశక్తులు, హత్యల వంటి తీవ్రమైన కేసులలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నవారు స్మార్ట్‌ఫోన్లను యథేచ్ఛగా వాడుతున్నారు. కొందరు జైళ్లలో కూర్చుని బయట వ్యక్తులతో వ్యవహారాలు సాగిస్తున్నారు. మరికొంత మంది బెదిరింపులకు పాల్పడి వసూళ్లు చేస్తున్నారు. పరప్పన అగ్రహార జైలులో హెచ్‌సీబీఎస్ టవర్ల(HCBS Towers) ఏర్పాటుకు ఐదేళ్లకు గాను రూ.4.67 కోట్లు ఖర్చు కానుంది.


pandu2.jpg

మే 2న రూ.2.96 కోట్లు విడుదల చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌(Actor Darshan)తోపాటు రౌడీలు మొబైల్‌ వాడిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడం జైళ్లశాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. జైళ్లశాఖ డీజీపీ మాలిని కృష్ణమూర్తికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. బెంగళూరు పరప్పన జైలు(Bangalore Parappana Jail)తోపాటు బెళగావి, విజయపుర, ధారవాడ, బళ్లారి, శివమొగ్గ, తుమకూరు సెంట్రల్‌ జైలుకు మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేశారు. జామర్‌ సర్వీసులు కొనసాగించేందుకు రిలయెన్స్‌, జియోకు రూ.86.99 లక్షలు, భారతి ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌కు రూ.87 లక్షలు, ఒడాఫోన్‌ - ఐడియా సంస్థకు రూ.57 లక్షలు, 30 కేవీఏ డీజిల్‌ జనరేటర్లకు రూ.19లక్షలు ఖర్చు చేశారు.


ఎన్నో సంఘటనలు వెలుగులోకి..

భద్రావతి ఎమ్మెల్యే సంగమేశ్వర్‌ కుమారుడు బసవరాజ్‌ హత్యకు జైలులోని ముబారక్‌ అలియాస్‌ డిచి ముబారక్‌ సుపారీ ఇవ్వడం వెలుగు చూసింది. అంతే కాకుండా గతంలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరి, మహారాష్ట్ర(Maharashtra)లోని నాగ్‌పూర్‌ కార్యాలయానికి బెళగావిలోని హిండలగా జైలు నుంచి నొటోరియస్‌ జయేశ్‌పూజారి ఫోన్‌ చేసి రూ.10కోట్లు డిమాండ్‌ చేశారు. జైళ్లశాఖ డీఐజీ టీబీ శేషకు పరప్పన అగ్రహార, బెళగావి జైళ్ల నుంచే క్వార్టర్స్‌ పేల్చివేస్తామని బెదిరించడం, పరప్పన అగ్రహార నుంచి రౌడీ మనోజ్‌ ఓ యువతికి నగ్న వీడియో పంపి రూ.40వేలు వసూలు చేయడం వంటివి సంచలనమయ్యాయి. దీంతో జైళ్లశాఖలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

pandu2.3.jpg


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 03 , 2024 | 01:20 PM