Home » Rohit Sharma
సిరీస్ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా చతికిలపడింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో పరాజయం పాలైంది. 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి 138 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక జట్టు ఏకంగా 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా ప్రదర్శన చాలా మందిని షాక్కు గురి చేస్తోంది. టీ20 సిరీస్ను వైట్ వాష్ చేసిన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం తడబడుతోంది. తొలి వన్డే టైగా ముగియగా, రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నాడు. ఇటీవలే అతడి నాయకత్వంలోని భారత్ టీ20 వరల్డ్ కప్-2024ను ముద్దాడింది. ఇక వ్యక్తిగతంగా ఫామ్ దృష్ట్యా కూడా హిట్మ్యాన్ అద్భుతంగా రాణిస్తున్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit Sharma) తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇటివల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న రోహిత్ ఇప్పుడు వన్డేల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. శుక్రవారం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో హిట్మ్యాన్ రోహిత్ మరో అరుదైన ఘనతను సాధించాడు.
ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత, ఐసీసీ కొత్త టెస్ట్ ర్యాంకింగ్స్(ICC Test batsmen rankings 2024)ను తాజాగా విడుదల చేసింది. ఈ సిరీస్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(joe root) చాలా పరుగులు చేశాడు. దీంతో జో రూట్ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచాడు.
టీ20ల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా ఉంటాడని అంతా అనుకుంటే.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ను రంగంలోకి..
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2016లో టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు అరంగేట్రం చేశాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తరఫున ఆడాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపులో వైస్ కెప్టెన్గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించాడు.
ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టకముందు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల విషయంలో అతనెలా వ్యవహరిస్తాడోనని అందరికీ అనుమానాలు ఉండేవి. ఇద్దరు చాలా సీనియర్లు..
టీ20 వరల్డ్కప్లో టైటిల్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి అభిమానుల్లో..