Champions Trophy 2025: అందరి నోటా ఒకటే మాట.. రాసిపెట్టుకోండి.. ఆ టీమ్‌దే కప్
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:14 PM
Champions Trophy Prediction: చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు షురూ అయిన నేపథ్యంలో ఈసారి కప్ ఎవరిదో అనే చర్చ మరింత ఊపందుకుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్లు ఏం చెబుతున్నారు? వాళ్ల ప్రిడిక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

చాంపియన్స్ ట్రోఫీ-2025 సంరంభం మొదలైంది. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య టోర్నీ ఓపెనర్ స్టార్ట్ అయింది. రేపు భారత్ కూడా బరిలోకి దిగుతోంది. కప్పు కోసం క్రమంగా ఒక్కో టీమ్ యుద్ధ మైదానంలోకి దిగనుంది. దీంతో ఇప్పుడంతా మెగా టోర్నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈసారి కప్పు ఎవరు కొడతారోననే చర్చ మరింత ఊపందుకుంది. దీనిపై భారీగా ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో దినేశ్ కార్తీక్ దగ్గర నుంచి జహీర్ ఖాన్ వరకు కొందరు భారత దిగ్గజాలు తమ అంచనాలు చెప్పారు. ఈసారి చాంపియన్స్ ట్రోఫీలో ఎవరు విజేతగా నిలుస్తారో ప్రిడిక్షన్ చెప్పారు. వాళ్ల జోస్యం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కప్పు వాళ్లదే!
ఈసారి చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునేది టీమిండియానే అని జహీర్ జోస్యం పలికాడు. దినేశ్ కార్తీక్, పార్థీవ పటేల్, ఆర్పీ సింగ్, రోహన్ గవాస్కర్, మురళీ కార్తీక్ లాంటి ఇతర మాజీ ఆటగాళ్లు కూడా కప్పు కొట్టేది భారతేనని బల్లగుద్ది చెబుతున్నారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా ఈసారి చాంపియన్‌గా రోహిత్ సేన నిలుస్తుందని అంటున్నాడు. అయితే ఎవర్‌గ్రీన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం దీనికి కాస్త భిన్నంగా ప్రిడిక్షన్ చెప్పాడు. డేంజరస్ టీమ్ ఆస్ట్రేలియా విన్నర్‌గా నిలుస్తుందన్నాడు. మెజారిటీ దిగ్గజ క్రికెటర్లు మాత్రం భారత్‌దే కప్పు అని నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుత ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ప్రతి మ్యాచ్‌ను ఫైనల్‌గా భావిస్తూ ఆడితే మన టీమ్‌ను ఆపడం ఎవరి వల్లా కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. అటు అభిమానులు, ఇటు విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అంతా కలసి భారత్‌దే కప్పు అని ముక్తకంఠంతో చెబుతున్నారు.. కాబట్టి ఏం జరుగుతుంది? ఫ్యాన్స్ ఆశల్ని రోహిత్ సేన ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.
ఇవీ చదవండి:
టీమిండియాను తలెత్తుకునేలా చేసిన గిల్
ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్ ప్లేయర్: యువరాజ్
కర్రాన్ సెంచరీ.. జింబాబ్వేదే సిరీస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి