Home » Sports
టీ 20ల్లో శ్రీలంక జట్టును టీమిండియా వైట్ వాష్ చేసింది. సిరీస్ క్లీన్ స్విప్ చేసింది. నిన్న జరిగిన తొలి వన్డేలో లంక జట్టు షాక్ ఇచ్చినంత పనిచేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 230 పరుగులు చేసింది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. 230 పరుగుల వద్ద ఆగింది.
రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతామన్నారు. ఇందుకోసం హరియాణా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పాలసీలను అధ్యయనం చేసి, తుదిరూపు ఇస్తామని తెలిపారు.
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో ఒక్క బౌట్.. ఒకే ఒక్క బౌట్..! ఇప్పుడు వివాదానికి కారణమైంది. జెండర్ వివాదానికి తెరలేపింది. మహిళతో పురుషుడు బాక్సింగ్ చేయడం ఏంటని కొందరు వాదించేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రిక్వార్టర్స్‌లో..
SL vs IND 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంక, భారత్‌లు తొలి వన్డేలో తలపడుతున్నాయి. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మొదటిసారి వన్డే క్రికెట్ ఆడనుండటం మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. క్యాన్సర్‌కు లండన్‌లో గల కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల భారత్ తిరిగొచ్చారు. ఆ వెంటనే మృతిచెందారు. గైక్వాడ్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
శ్రీలంకతో జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో సూర్యకుమార్ సేన జయకేతనం ఎగరవేసింది. నిన్నటి మ్యాచ్‌లో రెండు హైలెట్స్ ఉన్నాయి. ఒకటి బంతితో సూర్యకుమార్ రాణించడం.. మరొకటి రింకూ సింగ్ కూడా బాల్‌తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ మొహం వెలగిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
టీ20ల్లో భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యానే కెప్టెన్‌గా ఉంటాడని అంతా అనుకుంటే.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను రంగంలోకి..
క్రీడాకారుల అభ్యున్నతికి చేయూత ఇవ్వాల్సిన స్పోర్ట్స్ కోటా.. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీవోఏ) నిర్లక్ష్యపూరిత వైఖరి, క్రీడా సంఘాల కుమ్ములాటల కారణంగా ప్రతిభగల క్రీడాలకు వర్తించని పరిస్థితి ఏర్పడింది.
శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో సూర్యకుమార్ అనుసరించిన వ్యుహాలు ఫలించాయి. దాంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతోంది. సూర్య వేసిన ఎత్తుగడలు ఫలించాయి.
ఒలింపిక్ కామెంటేటర్ బాబ్ బల్లార్డ్ నోటి దూలను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా మహిళ జట్టును అవహేళనగా మాట్లాడారు. ఆ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాబ్ సహచరులు కూడా అతని కామెంట్లను ఖండించారు. ఇంకేముంది టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ యూరోస్పోర్ట్స్ కంపెనీ చర్యలు తీసుకుంది. తక్షణమే బాబ్ను విధుల నుంచి తప్పించింది.