Home » Telugu Desam Party
Minister Satyakumar: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు.
CM Chandrababu: గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎడాపెడా జగన్ అప్పులు చేశారని ఆరోపించారు. గత ఐదేళ్లు నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిన పెట్టడం వల్ల ప్రజల్లో మరింత నమ్మకం వచ్చిందని అన్నారు. జగన్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.
CM Chandrababu:తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
Palla Srinivasa Rao: అసమర్థత, అవినీతి, ఆరోపణల మీద తప్ప మంత్రుల మార్పు ఆలోచన కూటమి ప్రభుత్వంలో ఉండదని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థలో నాలుగేళ్ల వరకు పదవి కాలం ఉంటుంది కనుక ..ఆ సమయం పూర్తి అయిన తర్వాత ఆలోచన చేస్తామని అన్నారు.
CM CHANDRABABU: ఎన్టీఆర్ నీళ్ల విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలుగొండను తానే ప్రారంభించి పూర్తిచేశానని గుర్తుచేశారు. అనంతపురం తలసరి ఆదాయంలో ముందు వరుసకు వచ్చిందని చెప్పారు రాయలసీమకు నీరు వస్తే డెల్టాతో పోటీపడుతుందని అన్నారు. కృష్ణానదిలో పై నుంచి నీరురావడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Ashok Gajapathi Raju: రుషికొండపై జగన్ నిర్మించిన అరాచక భవనం ఓ తెల్ల ఏనుగుతో సమానమని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండపై నిర్మించిన భవనాన్ని పిచ్చాస్పత్రికి కేటాయిస్తే మంచిదని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.
Buddha Venkanna: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా నాని ఉన్నప్పుడు వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అసభ్యకరమైన సినిమా తీయడానికి నీతో చర్చ చేసింది వాస్తవమా కాదా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
Minister Kollu Ravindraః మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు.
Kolusu Partha Sarathy: ఏపీని లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్‌గా సీఎం చంద్రబాబు మార్చారని పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పోలవరం 2021లో పూర్తి చేసి ఉంటే విద్యుత్ ఆదా అయ్యేదని తెలిపారు. హిందూజాకు రూ.1400 కోట్లు జగన్ అప్పనంగా ఇచ్చారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు.
MLA Gorantla Butchaiah Chowdary: అన్ని వ్యవస్థలను వైసీపీ అధినేత జగన్ నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జగన్ తీరు వల్ల పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పింఛన్లు అందజేశామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.