Share News

Ashok Gajapathi Raju: ఆ విషయాన్ని నేను నమ్మను.. అశోక్ గజపతిరాజు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:22 PM

Ashok Gajapathi Raju: రుషికొండపై జగన్ నిర్మించిన అరాచక భవనం ఓ తెల్ల ఏనుగుతో సమానమని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండపై నిర్మించిన భవనాన్ని పిచ్చాస్పత్రికి కేటాయిస్తే మంచిదని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.

Ashok Gajapathi Raju: ఆ విషయాన్ని నేను నమ్మను.. అశోక్ గజపతిరాజు షాకింగ్ కామెంట్స్
Ashok Gajapathi Raju

విజయనగరం: శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పది లక్షల యాభై వేల మంది విద్యార్ధులకు బడి లేకుండా చేసిన మాజీ మంత్రి బొత్స కాలుకి తమ మంత్రి దండం పెడతారని తానైతే నమ్మనుగాక నమ్మనని చెప్పారు. రుషికొండపై జగన్ నిర్మించిన అరాచక భవనం ఓ తెల్ల ఏనుగుతో సమానమని విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండపై నిర్మించిన భవనాన్ని పిచ్చాస్పత్రికి కేటాయిస్తే మంచిదని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.


ఆ ట్రోల్స్‌లో నిజం లేదు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Kondapalli-Srinivas.jpg

శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స కాలికి తాను నమస్కారం చేసినట్లుగా వస్తున్న ట్రోల్స్‌లో నిజం లేదని స్పష్టం చేశారు. నాయకత్వ లక్షణాన్ని బలహీన పరచటానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఎన్నో అవమానాలకు, వేధింపులకు బలైన కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఓ వర్గం కుట్రపూరిత ఆరోపణలు చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు విమర్శలు చేశారు.


వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

Mamidi-Govinda-Rao-MGR.jpg

శ్రీకాకుళం: విద్యుత్ చార్జీల పెంపు పేరిట వైసీపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆరోపించారు.చార్జీల పెంపు వైసీపీ పాపమేనని విమర్శించారు. రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించిన ధర కంటే వైసీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందని చెప్పారు. రాజాస్థాన్ రూ. 2.25 పైసలకు కొంటే వైసీపీ ప్రభుత్వం రూ. 2.75 పైసలకు కొందని చెప్పారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా వైసీపీ నేతలు రోడ్డెక్కుతున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వినియోగదారులకు ఒక్క పైసా విద్యుత్ చార్జీలు పెంచలేదని చెప్పారు. మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని నాడు జగన్ చేతిలో పెట్టామని తెలిపారు. జగన్ ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Amaravati: జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

Deputy CM Pawan Kalyan : తోలుతీసి కూర్చోబెడతాం

JC Prabhakar Reddy: వీపు విమానంమోతమోగిస్తా.. మాజీ మంత్రికి జేసీ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 29 , 2024 | 08:38 PM