Home » Tirumala
తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ అనుమతించాలని.. అలా అనుమతించకుంటే ఎంతవరకైనా వెళతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ రాజేశ్వరరావు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 7న దువ్వాడతో కలసి తిరుమల వచ్చిన ఆమె మాడవీధుల్లో, పుష్కరిణి వద్ద వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాము సహజీవనంలో ఉన్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని తిరుమలలో మాధురి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం వివాదాస్పదమైంది.
తిరుమలలో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి చేయి కోసుకుని వీరంగం సృష్టించాడు.
రేపు శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రకటించారు. తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా.. భక్తులు ఇబ్బందులు పడకుండా గురువారం శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని ..
భక్తి శ్రద్ధలతో భక్తులు తాళ్లతో లాగుతుండగా, మహారథంపై దేవేరులతో కలిసి నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7గంటలకు రధోత్సవం జరగనుంది. రాత్రి 7 గంటలకు కల్కి అవతారం అలంకరణలో మలయప్ప స్వామి అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు కీలకమైన గరుడ సేవ జరగనుంది. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.
టోకెన్ విధానంలో సర్వ దర్శనం మూడు నుంచి ఆరు గంటల్లోపు పూర్తవుతుంది. సాధారణంగా చాలామంది భక్తులకు టోకెన్ విధానంపై అవగాహన లేకపోవడంతో నేరుగా తిరుపతి నుంచి తిరుమల కొండపైకి చేరుకుని సర్వ దర్శనం క్యూలైన్లోకి వెళ్లడంతో..
తిరుమల ప్రసాదాలు అనేకం క్రీ.శ. 830 నుంచి ఉనికిలో ఉన్నట్టు శాసనాధారాలున్నా, ప్రస్తుతం ఉన్న రూపంలోని లడ్డూ ప్రస్తావన మాత్రం 1940ల నుంచే ఉంది. అంతకు మునుపు బూందీ రూపంలో ప్రసాదంగా ఉండేది.