Home » Union Budget 2024-25
Telangana: కేంద్ర బడ్జెట్ ఏపీ, బీహార్ బడ్జెట్‌లాగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏపీకి ఇచ్చిన దానిపై మాకు బాధ లేదు, అసూయ లేదు’’ అని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీతో పాటు తెలంగాణ కూడా ఉందని గుర్తుచేశారు. బీజేపీకి గతంలో తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారన్నారు.
Andhrapradesh: ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 కోట్లు ఇస్తామన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారన్నారు.
Andhrapradesh: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్టులో పోందుపర్చడం సంతోషంగా ఉందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చన్నారు.
Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ (Union Budget 2024)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించే బడ్జెట్ ఇదని, యువతకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు లభిస్తాయని అన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.
కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు. రికార్డు స్థాయిలో సీతారామన్ వరసగా ఏడవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48.21 లక్షల కోట్లు బడ్జెట్‌ను ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయింపుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామంటూ బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీతారామన్ ప్రకటన చేశారు.
హార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) డిమాండ్ చేస్తుంది. తాజా బడ్జెట్‌లో అలాంటి ప్రతిపాదన లేవి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించ లేదు.