Share News

Union Budget 2024-25: బడ్జెట్‌ ప్రభావంతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే!

ABN , Publish Date - Jul 23 , 2024 | 01:35 PM

కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు. రికార్డు స్థాయిలో సీతారామన్ వరసగా ఏడవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48.21 లక్షల కోట్లు బడ్జెట్‌ను ప్రకటించారు.

Union Budget 2024-25: బడ్జెట్‌ ప్రభావంతో ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే!
Unon Budget 2024-25

కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు. రికార్డు స్థాయిలో సీతారామన్ వరసగా ఏడవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48.21 లక్షల కోట్లు బడ్జెట్‌ను ప్రకటించారు. కాగా బడ్జెట్ ప్రకటనల్లో భాగంగా క్యాన్సర్‌ ఔషధాలు, మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. దిగుమతి చేసుకునే బంగారం, వెండి, తోలుతో తయారు చేసిన వస్తువులు, సముద్రపు ఆహార పదార్థాలు కూడా చౌకగా మారనున్నాయి.


కేంద్ర ప్రభుత్వం మరో 3 క్యాన్సర్ ఔషదాలను కూడా కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇస్తోందని సీతారామన్ చెప్పారు. ఇక మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర మొబైల్ విడిభాగాలపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్టు తెలిపారు.


బంగారం దిగుమతులపై సుంకం 6 శాతానికి తగ్గింపు..

బంగారం కొనుగోలుదారులకు బడ్జెట్ 2024-25లో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బంగారం, వెండిలపై దిగుమతి సుంకాలను 6 శాతానికి తగ్గించారు. దీంతో ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇక సుంకం తగ్గింపు నిర్ణయం స్మగ్లింగ్‌ను అరికట్టడంలోనూ దోహదపడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రకటనతో దేశీయంగా బంగారానికి రిటైల్ డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బులియన్ మార్కెట్‌గా భారత్ ఉంది. భారత్ విపరీతమైన డిమాండ్ ఉండే బంగారం, వెండి ధరలు ఈ ఏడాది రికార్డు గరిష్ఠ స్థాయికి పెరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం భారత వాణిజ్య లోటును పెంచుతోంది. అంతేకాకుండా రూపాయి బలహీన పడడానికి కారణం కూడా అవుతోందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ధరలు పెరగనున్న వస్తువుల ఇవే..

అమ్మోనియం నైట్రేట్‌పై 10 శాతం, బయోడిగ్రేడబుల్ సాధ్యంకాని ప్లాస్టిక్‌పై 25 శాతం మేర కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు టెలికం పరికరాలు కూడా పెరగనున్నాయి.

Updated Date - Jul 23 , 2024 | 02:31 PM