Home » Vijayawada Floods
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉప్పొంగిన వరదలతో పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయి. భారీ వర్షాలు వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది చనిపోయినట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాది మంది నగర జీవులు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ఎడ తెరపి లేకుండా కురిసిన బారీ వర్షాల కారణం వరదలు పొటెత్తడంతో విజయవాడకు ఉహించని నష్టం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం కారణం తక్కువ నష్టం జరిగిందని తెలిపారు.
బాధితులను ఆదుకోవడమంటే మాటలు చెప్పడం కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిరూపించారు. ఏకంగా రూ.4 కోట్ల వరద సాయాన్ని ఆయన ప్రకటించారు. వరద ప్రభావిత గ్రామాలకు ఆయన ఈ విరాళం అందించారు. మొత్తం 400 గ్రామ పంచాయతీలు వరద ముంపు బారిన పడ్డాయని, ఒక్కో పంచాయతీకి ఒక లక్ష రూపాయల చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తానని ప్రకటించారు.
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు ఎంతలా విలయం సృష్టించాయో తెలిసింది. విజయవాడ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. కూటమి ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది. కాగా ఈ వరద సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే.
కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీని వైఎస్ షర్మిల పరిశీలించారు.
తెలుగు రాష్ట్రాలను వరణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, ఏపీలో విజయవాడ జిల్లా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది.
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్న ఆయన.. ఇవాళ (మంగళవారం) కూడా మరిన్ని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ రోజు జేసీబీపై నాలుగున్నర గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇరురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.
కృష్ణలంక రిటైనింగ్ వాల్.. (Krishnalanka Retaining Wall) ఈ నిర్మాణంపై టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మేమే చేశామని వైసీపీ చెబుతుంటే.. అరే బాబోయ్ చరిత్ర తెలుసుకోకపోతే ఎలా..? టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. దీంతో ఈ వ్యవహారం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ అయ్యింది...