Home » YSRCP
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులను వెట్ చేయించి.. రూమ్లోకి వెళ్లిన వంశీ తమ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత 7 నెలలుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. అతని కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎట్టకేవలకు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో వంశీ గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నారు.
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి అతనిని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ నేతలు పార్టీ వీడి వెళ్లిపోకుండా ఉండేందుకే జగన్ 2.O అంటున్నారా.. ఐదేళ్లు అద్భుతంగా పాలిస్తే ప్రజలు ఎందుకు పక్కనపెట్టేశారు. జగన్ పిట్ట కథలతో కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తున్నారా..
KOllu Ravindra: మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జగన్ చర్చించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని,, యాత్రల పేరుతో డిప్యూటీ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని శైలజానాథ్ అన్నారు. సూపర్ సిక్స్ హామీలను చూసి ప్రజలు ఎన్డీయేకు అధికారం ఇచ్చారని, హామీలు ఇచ్చేటప్పుడు సీఎం చంద్రబాబుకు తెలియదా.. అని ఆయన ప్రశ్నించారు.
YS Jagan:పులివెందులలో వైఎస్ జగన్కు చెక్ పెట్టేలా తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రజల్లో బలం ఉన్న వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీని ఢీకొట్టేలా పావులు కదుపుతోంది.
రాష్ట్ర మద్యం విధానంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
Prathipati Pulla Rao: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్దాలు, మోసాలతో ప్రజల్ని వంచించారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఏపీని దోచేసి అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు.
YSRCP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజినీ విశ్వరూపం చూపిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ బడా నేతలకు దడ పుట్టిస్తున్నారు. అసలు ఆమె ఏం చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..