Share News

Vallabhaneni Vamsi: ఏమి తెలివి గురూ.. పోలీసులతో ఆటాడుకున్న వంశీ..

ABN , Publish Date - Feb 13 , 2025 | 10:24 AM

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులను వెట్ చేయించి.. రూమ్‌లోకి వెళ్లిన వంశీ తమ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వంశీ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vallabhaneni Vamsi: ఏమి తెలివి గురూ.. పోలీసులతో ఆటాడుకున్న వంశీ..
Vallabhaneni Vamsi

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకే అదుపులోకి తీసుకున్నారు. వంశీని అరెస్ట్ చేసే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులే ఆశ్చర్యపోయారట. హైదరాబాద్‌లోని రాయదుర్గం సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వంశీ ఉన్నారని తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. వంశీ ఉండే ప్లాట్‌లోకి వెళ్లి అరెస్ట్ విషయాన్ని తెలియజేశారు. దీంతో డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పడంతో పోలీసులు సరే అన్నారు. డ్రెస్ మార్చుకుని వస్తానన్న వంశీ చాలాసేపటివరకు బయటకు రాలేదట. ఈలోపు తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారనే విషయాన్ని కొందరు వైసీపీ నాయకులకు, తన అనుచరులకు వంశీ చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తమ పార్టీకి సంబంధించిన మీడియాకు సమాచారం ఇచ్చారట. దీంతో వంశీ డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చేలోపు సదరు మీడియా సంస్థ ప్రతినిధులు రాయదుర్గంలోని వంశీ ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. వంశీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా ప్రతినిధులను చూసి పోలీసులు బిత్తరపోయారట. వంశీ అనుచరులతో పాటు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న వైసీపీ నేతలు రాయదుర్గంలోని వంశీ ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించడంతో వంశీపై ఈ విషయంలో కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


పోలీసులతో ఆటాడుకున్న వంశీ..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డ్రెస్ మార్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. సాధారణంగా పది నుంచి పదిహేను నిమిషాల సమయం డ్రెస్ ఛేంజ్ చేసుకునేందుకు సరిపోతుంది. అయినప్పటికీ దాదాపు 30 నిమిషాలకు పైగా సమయాన్ని వంశీ తీసుకున్నారు. నోటీసులు జారీచేసి అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలియజేసినతర్వాత.. వంశీ ఎవరితో మాట్లాడాలన్నా, ఫోన్లు చేయాలన్న పోలీసుల అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా పోలీసులను వెయిట్ చేయించారు. దీంతో పోలీసులు వంశీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోలీసు వ్యవస్థను మేనేజ్ చేసి, అప్పటి ప్రతిపక్షనేతలపై అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పోలీసులతోనే ఆటాలాడుతూ.. వారికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్తున్న పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత కోర్టులో హజరుపర్చనున్నారు. సత్యవర్థన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వంశీపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 13 , 2025 | 10:24 AM