Share News

Prathipati Pulla Rao:ఏపీని దోచేసి అప్పుల కుప్పగా మార్చారు

ABN , Publish Date - Feb 11 , 2025 | 02:50 PM

Prathipati Pulla Rao: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్దాలు, మోసాలతో ప్రజల్ని వంచించారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఏపీని దోచేసి అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు.

Prathipati Pulla Rao:ఏపీని దోచేసి అప్పుల కుప్పగా మార్చారు
Prathipati Pulla Rao

పల్నాడు జిల్లా: నేరమయ రాజకీయాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు వైసీపీకి చెంపపెట్టు అని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. హత్యా రాజకీయాల పునాదులపై వైసీపీని జగన్ నిర్మించారని ఆరోపించారు. అవినీతి, విద్వేషమనే కవచాలతో వైసీపీని కాపాడుకుంటున్నారని చెప్పారు. క్రిమినల్ కేసులున్న వారు పాలకులయితే జరిగే నష్ట ప్రభావం రాష్టం గత ఐదేళ్లు చవిచూసిందని అన్నారు. హత్యలు చేసి దర్జాగా పాలన సాగించి, తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నిస్సిగ్గుగా ఎదుటివారిపై బురదజల్లారని మండిపడ్డారు. అబద్దాలు, మోసాలతో ప్రజల్ని వంచించి రాష్ట్రాన్ని దోచేసి అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. సమాజంలో ఉండటానికే పనికిరాని వారిని అందలం ఎక్కిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందో ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.


వైసీపీ నేతలు అమాయక గిరిజనులను రెచ్చగొడుతున్నారు: గిడ్డి ఈశ్వరి

Giddi Eswari.jpg

అల్లూరిజిల్లా(పాడేరు): గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు వక్రీకరించి అమాయక గిరిజనులను రెచ్చగొడుతున్నారని టీడీపీ పాడేరు మాజీ ఎమెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్లో 1/70 రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదని, గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ఏమీ చేయాలో అధికారులను అడిగారని చెప్పారు.


గత వైసీపీ ప్రభుత్వం జీఓ నెం.3 రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. అప్పుడు వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వివరణ కావాలంటే ముందు అసెంబ్లీకి వెళ్లి వైసీపీ నేతలు అడగితే సమాధానం చెబుతారని అన్నారు. ఏజెన్సీలో వైసీపీ నాయకులు బంద్ చేయడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..

4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 11 , 2025 | 03:08 PM