Home » Telangana » Assembly Elections
బీఆర్ఎస్ అధినేత, మాజీ మఉక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ( Governor Tamilisai ) ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుని అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ( Kadiam Srihari ) వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తుందని ఆ పార్టీ నేత రఘునందనరావు ( Raghunandana Rao ) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ కడియం సీనియర్ శాసనసభ్యుడిగా ఈ వ్యాఖ్యలు చేయడం తగదు. కడియం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం.ఎంఐఎంతో బీఆర్ఎస్ అంటకాగితే మాకు సంబంధం లేదు’’ అని రఘునందనరావు పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పలు మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారిని రేవంత్ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav ) ఆరా తీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించారు.
తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం (Telangana Assembly Session) ముగిసింది. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారభమయ్యాయి. ఈ సభలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ (Protem Speaker Akbaruddin Owaisi) కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు.
మాసబ్ ట్యాంక్‌లో ఉన్న పశు సంవర్థక శాఖలో ముఖ్యమైన ఫైళ్లని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ చించేయిస్తున్నారు. ఫైల్స్ అన్ని చించేసి సంచులల్లో మూట గట్టి బయటకి తీసుకెళ్లేందుకు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడున్న సిబ్బంది కొంతమంది కళ్యాణ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారిని తోసుకుంటూ వెళ్లినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మేనిఫెస్టోలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అని తెలంగాణ ఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ( Maram Jagadishwar ) అన్నారు.
ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ( KC Venugopal ) తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR ) కి యశోద ఆస్పత్రిలో వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు.