Share News

CM Revanth Reddy: మల్లికార్జన ఖర్గేతో రేవంత్ భేటీ .. మరి కాసేపట్లో మంత్రుల శాఖలపై స్పష్టత..!

ABN , First Publish Date - 2023-12-08T22:03:52+05:30 IST

ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌‌ ( KC Venugopal ) తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy:  మల్లికార్జన ఖర్గేతో రేవంత్ భేటీ .. మరి కాసేపట్లో మంత్రుల శాఖలపై స్పష్టత..!

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Enumula Revant Reddy ) భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణ మంత్రుల శాఖల కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో మంత్రుల శాఖలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌‌ ( KC Venugopal ) తో రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశం దాదాపు గంటపాటు కొనసాగింది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు.

అంతకుముందు కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. సమావేశం ముగియగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసానికి సీఎం రేవంత్‌రెడ్డి, మాణిక్ రావు ఠాక్రే, కేసీ వేణుగోపాల్ బయలుదేరారు. ఖర్గేతో సమావేశం పూర్తి కాగానే రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే రేవంత్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో మొదటగా మల్కాజ్‌గిరి ( Malkajgiri ) పార్లమెంట్ సభ్యత్వానికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ( Lok Sabha Speaker Home Birla ) ను కలిసి తన రాజీనామా పత్రాన్ని రేవంత్‌రెడ్డి సమర్పించారు. కాగా కొంతమంది ఏఐసీసీ అగ్రనేతలను కూడా రేవంత్‌రెడ్డి కలిసినట్లు సమాచారం.

Updated Date - 2023-12-08T23:44:21+05:30 IST