Home » Telangana » Nalgonda
హింసకు గురైన మహిళలకు ఒకే చోట వైద్య, కౌన్సిలింగ్, పోలీస్, న్యాయ సహాయం, ఉచిత వసతి లాంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సఖి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ పరిధిలోని భువనగిరి మిల్క్ చిల్లింగ్ పరిధిలో అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. భువనగిరి కేంద్రంలో ఉద్యోగులు లక్షల రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో మదర్ డెయిరీ చైర్మన గుడిపాటి మధుసూదనరెడ్డి ఆరుగురు ఉద్యోగులపై వేటు వేసి విచారణకు ఆదేశించారు.
రైతుల్లో ప్రకృతి ప్రకోపం విషాదాన్ని నింపింది. ఈ ఏడాది సెప్టెంబరు 1న భారీ వర్షం కురిసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 30 సెంటీమీటర్ల వర్షం ఒక్క రాత్రిలో కురవడంతో సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది.
తొలినాళ్లలో కరువుతో రైతులను కష్టాల పాల్జేసినా కృష్ణమ్మ నడికారులో అన్నదాతలను ఆదుకుని వారి మోములో ఆనందాన్ని పారించింది.
టీఎస్ యూటీఎఫ్ (తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక మహాసభలకు రంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో ఏర్పాటుచేసిన ప్రాంగణంలో 28,29,30 తేదీల్లో మూడు రోజులపాటు ఈమహాసభలు జరగనున్నాయి.
రామన్నపేట పట్టణ పరిధిలో అంబుజా సిమెం ట్ పరిశ్రమ ప్రతిపాదిత స్థలంలో పనులను స్థా నికులు అడ్డుకున్నారు. శుక్రవారం భారీ యం త్రాలతో పనులు చేసేందుకు వచ్చిన సిబ్బందిని స్థానిక ప్రజలు, పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు అక్కడినుంచి పంపించివేశారు.
మన్మోహన్సింగ్ దేశ ప్రధానిగా, ఆర్థికమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప మహనీయుడని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయరంగం ఈ ఏడాది పలు ఆటుపోట్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ఖరీ్ఫ లో ఆలస్యంగా వర్షాలు కురవడం, నాగార్జునసాగర్ సైతం ఆలస్యంగా వరద రావడంతో ఆయకట్టులో వరిసాగు ఆలస్యమైంది.
సీపీఐ వందేళ్ల చరిత్ర అంతా పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాటాలేననీ ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.
పెరుగుతున్న చలి జిల్లా వాసులను వణికిస్తున్నది. శీతాకాలానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మూడు రోజులుగా కురుస్తున్న తేలిక పాటి వర్షపు జల్లులతో చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది.