Home » Telangana » Nalgonda
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఏ కాల్వ ఎక్కడుందో తెలియదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీ్షరెడ్డి అన్నారు. మండలంలోని గుడుగుంట్లపాలెంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవా రం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ర్యాగింగ్ దురలవాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోసారి వెలుగుచూసింది. నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ చేసిన ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదైన ఉదంతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నల్లగొండ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) చైర్మన్లు అధ్యయన యాత్రకు వెళ్లనున్నారు.
ఈ చిత్రంలో ఉత్సాహంగా పరుగెడుతున్న బాలురంతా దివ్యాంగులు.. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
గ్రూపు-3 పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో 88 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 28,353 మంది అభ్యర్థులకు 15,257 మంది హాజరయ్యారు.
యాదగిరీశుడి బాలాలయ ఖాళీ స్థలంపై అందరి దృష్టి పడింది. ప్రధానాలయం ప్రారంభానికి ముందు బాలాలయం ఏర్పాటు చేసిన ప్రదేశం ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఇక్కడ కల్యాణ మండపం, ధ్యాన మందిరం నిర్మించేందుకు 2023 ఆగస్టు 21న వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్రావు, మైహోమ్ రామేశ్వరరావుతో కలిసి చిన్న జీయర్ స్వామి పూజలు చేశారు.
ధరణి వెబ్సైట్లో రికార్డుల నమోదు సందర్భంగా అధికారులు, ఉద్యోగులు చేసిన తప్పిదాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఫిర్యాదులు చేస్తుండడంతో ధరణిలో రికార్డుల అప్డేషన్లో జరిగిన అక్రమాలు, ఉద్యోగుల చేతివాటం బయట పడుతోంది. తాజాగా నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం జీకే అన్నారంలో సాదాబైనామా డాక్యుమెంట్ ఆఽధారంగా భూ యజమానురాలికి సంబంధం లేకుండానే ఆమె తన భూమిని విక్రయించినట్టుగా 13-బీ ఫారం ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెరపైకి వచ్చింది.
ఉరుకులు, పరుగుల జీవితం..యాంత్రిక జీవన విధానంలో పేద, మధ్య తరగతి వర్గాల్లో అధిక శాతం ప్రజలు ద్విచక్ర వాహనాలు వాడుతున్నారు.
పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల (ఫిజికల్ డైరెక్టర్ల) కొరత విద్యార్థుల పాలిట పెనుశాపంగా మారింది.