జీఎస్‌ఎల్వీ-ఎఫ్10కు గ్రీన్‌సిగ్నల్
ABN , First Publish Date - 2021-08-11T08:13:09+05:30 IST
ఇస్రో జీఎ్‌సఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్
- నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం..
- రేపు నింగిలోకి రాకెట్
శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఆగస్టు 10: ఇస్రో జీఎ్‌సఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలోని రెండవ ప్రయోగవేదికపై నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. మంగళవారం వర్చువల్ మోడ్‌లో వివిధ ఇస్రో సెంటర్ల నుంచి శాస్త్రవేత్తలు సమావేశమై కౌంట్‌డౌన్ రిహార్సల్స్‌లో రాకెట్ పనితీరును విశ్లేషించారు.
అనంతరం సాయంత్రం షార్‌లో లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై రాకెట్ ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు షార్‌లో కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 5.43 గంటలకు భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎ్‌స-03తో జీఎ్‌సఎల్వీ-ఎఫ్10 నింగిలోకి దూసుకుపోనుంది.