Shikhar Dhawan: గబ్బర్‌లో ధోనీని చూసిన పాక్ క్రికెటర్
ABN , First Publish Date - 2021-07-27T02:32:45+05:30 IST
శ్రీలంకతో జరుగుతున్న వైట్ బాల్ సిరీస్‌లో భారత యువ జట్టుకు సారథ్యం వహిస్తున్న శిఖర్ ధావన్‌పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరుగుతున్న వైట్ బాల్ సిరీస్‌లో భారత యువ జట్టుకు సారథ్యం వహిస్తున్న శిఖర్ ధావన్‌పై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా, పాకిస్థాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కూడా ఈ జాబితాలోకి చేరాడు. అక్మల్ తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ.. గబ్బర్‌ను ధోనీతో పోల్చాడు. ధావన్‌లో తనకు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు.
భారత జట్టుపై శ్రీలంక బౌలర్లు పైచేయి సాధించిన సమయంలోనూ ధావన్‌లో ఎలాంటి భావాలు కనిపించలేదని, చాలా కామ్‌గా, కూల్‌గా ఉన్నాడని పేర్కొన్నాడు. ‘‘తొలి టీ20లో ధావన్ కెప్టెన్సీ చాలా బాగుంది. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ అమరిక నన్ను ఆకట్టుకున్నాయి. ధావన్ కూల్ కెప్టెన్‌గా కనిపించాడు. ఇంకా నిజం చెప్పాలంటే ధావన్‌లో నాకు ధోనీ ఛాయలు కనిపించాయి’’ అని అక్రమాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.
ఒత్తిడిలోనూ గబ్బర్ చక్కని నిర్ణయాలు తీసుకున్నాడని కితాబిచ్చాడు. శ్రీలంక మంచి శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ ధావన్ ఎలాంటి ఆందోళనకు గురికాలేదన్నాడు. రెండు ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా శ్రీలంక 20 పరుగులు చేసిన తర్వాత కూడా భారత జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించిందంటే ఆ క్రికెట్ మొత్తం ధావన్‌కే చెందుతుందని అన్నాడు. బౌలర్లు కూడా చక్కని ప్రదర్శన కనబరిచారని అక్మల్ ప్రశంసించాడు.