గుజరాత్ సీఎంకు కరోనా

ABN , First Publish Date - 2021-02-15T20:18:55+05:30 IST

ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు వైద్యులు సోమవారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఆదివారం

గుజరాత్ సీఎంకు కరోనా

అహ్మదాబాద్: ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు వైద్యులు సోమవారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఆదివారం రాత్రి వైద్యులు ఆయన ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లోనే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. కొన్ని రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన వడోదరాలో జరిగిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ సభ పూర్తవగానే ఆయనకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. 


మరో వారం రోజులు ఆస్పత్రిలోనే : డిప్యూటీ సీఎం 

సీఎం రూపానీకి కరోనా సోకిందని డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ ప్రకటించారు. ఆయన ప్రతిరోజూ ప్రజలను కలుస్తుంటారని, అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా సభలకూ హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాస్త బలహీనంగా ఉండటంతో సభలో ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయారని ఆయన తెలిపారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని, కరోనా పాజిటివ్ అని తేలిందని డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పాటిల్ తెలిపారు. 

Updated Date - 2021-02-15T20:18:55+05:30 IST