గుంటూరులో గాలి.. వాన
ABN , First Publish Date - 2021-04-15T05:48:54+05:30 IST
వేసవి తాపంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ వరుణుడు నగరవాసులను పలకరించాడు. వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్న నగరవాసులకు బుధవారం సాయంత్రం కురిసిన తేలకపాటి వర్షం కొంత ఊరట నిచ్చింది.

గుంటూరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): వేసవి తాపంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ వరుణుడు నగరవాసులను పలకరించాడు. వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్న నగరవాసులకు బుధవారం సాయంత్రం కురిసిన తేలకపాటి వర్షం కొంత ఊరట నిచ్చింది. భానుడి భగభగలకు సాయంత్రం కురిసిన వర్షానికి నగరవాసులు ఉపశమనం పొందారు. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పూర్తిగా మేఘాలు కుమ్ముకున్నాయి.
యార్డుల్లో రైతుల ఇక్కట్లు
ఒక్కసారిగా కురిసిన వర్షంతో యార్డుకు మిర్చి తెచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. యార్డులో ఆరబోసిన మిర్చిపై ఉరుకులు పరుగులతో రైతులు పట్టాలు కప్పి కాపాడుకునే యత్నం చేశారు.
