ముందస్తు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి : జడ్జి
ABN , First Publish Date - 2021-09-09T05:17:42+05:30 IST
స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ నెల 11న శనివారం నిర్వహించే నేషనల్ మెగా లోక్ అదాలత్ సందర్భంగా డీఎల్‌ఎ్‌సఏ కార్యాలయంలో నిర్వహించే ముందస్తు లోక్ అదాలత్‌లను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరి, సీనియర్ సివిల్ జడ్జి కవిత పేర్కొన్నారు.

కడప(రూరల్), సెప్టెంబరు 8: స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ నెల 11న శనివారం నిర్వహించే నేషనల్ మెగా లోక్ అదాలత్ సందర్భంగా డీఎల్‌ఎ్‌సఏ కార్యాలయంలో నిర్వహించే ముందస్తు లోక్ అదాలత్‌లను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరి, సీనియర్ సివిల్ జడ్జి కవిత పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం ముందస్తు లోక్ అదాలత్ సిట్టింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ నేషనల్ మెగా లోక్ అదాలత్‌లో అధిక కేసుల పరిష్కారానికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. అగ్రికల్చరల్ క్రాప్ కేసులకు సంబంధించి వ్యవసాయశాఖ, డీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడారు.