గుంటూరు యార్డుకు పోటెత్తిన మిర్చి

ABN , First Publish Date - 2021-04-08T08:27:27+05:30 IST

గుంటూరు మిర్చియార్డుకు మిరప దిగుబడులు పోటెత్తాయి. యార్డులో ఖాళీలేక గుంటూరు-హైదరాబాద్‌ రోడ్డుపై రెండు కిలోమీటర్ల పొడవునా మిర్చి టిక్కీలతో లారీ లు నిలిచిపోయాయి. గత గురువారానికే యార్డులో రెండు లక్షలకుపైగా మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా సెలవులు వచ్చినా..

గుంటూరు యార్డుకు పోటెత్తిన మిర్చి

గుంటూరు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): గుంటూరు మిర్చియార్డుకు మిరప దిగుబడులు పోటెత్తాయి. యార్డులో ఖాళీలేక గుంటూరు-హైదరాబాద్‌ రోడ్డుపై రెండు కిలోమీటర్ల పొడవునా మిర్చి టిక్కీలతో లారీ లు నిలిచిపోయాయి. గత గురువారానికే యార్డులో రెండు లక్షలకుపైగా మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా సెలవులు వచ్చినా.. రైతులు సరుకు తీసుకురావడంతో యార్డు ప్రాంగణం నిండిపోయింది. వారం కిందట బంగ్లాదేశ్‌ సరిహద్దులో చెక్‌పోస్టుని మూసేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. శ్రీలంకకు కూడా ఎగుమతులు జరగడం లేదని వ్యాపారులు తెలిపారు.


చైనాకు మాత్రమే నౌకల ద్వారా ఎగుమతులు జరుగుతున్నాయి. మిర్చి టిక్కీలు గంటల తరబడి ఎండలో ఉండటం వల్ల తూకంలో రెండు కిలోల తరుగు వస్తోందని, ఒక్కో టిక్కీకి రూ.300 వరకు నష్టపోవాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. సరుకు అమ్ముకునేందుకు మూడు, నాలుగు రోజులు పడుతుండగా.. కరోనా వ్యాప్తి సాగుతున్న పరిస్థితుల్లో సరుకు అమ్ముడయ్యే వరకు తలదాచుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు.

Updated Date - 2021-04-08T08:27:27+05:30 IST