రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న మోదీ

ABN , First Publish Date - 2021-09-15T00:26:37+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి

రాష్ట్రపతి భవన్‌ చేరుకున్న మోదీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించే అంశాలను మంత్రులకు తెలియజేయలేదని సమాచారం. అయితే కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 17న మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై కూడా చర్చ జరుగుతుందంటున్నారు. ఇప్పటి వరకు మంత్రులు సాధించిన విజయాలు, చేస్తున్న కృషి గురించి మాట్లాడతారని తెలుస్తోంది. కొత్త ఆలోచనలను పంచుకోవాలని కూడా మంత్రులను కోరే అవకాశం ఉందంటున్నారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రత్యేక నివేదికలను మోదీకి సమర్పిస్తారని సమాచారం.


మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు రాత్రి 9 గంటల వరకు జరుగుతుందని తెలుస్తోంది.


మోదీ జన్మ దినోత్సవాల సందర్భంగా బీజేపీ అనేక కార్యక్రమాలను తలపెట్టింది. దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువకావాలనే లక్ష్యంతో వీటిని రూపొందించారు. 


Updated Date - 2021-09-15T00:26:37+05:30 IST