రాఘవేందర్‌కు కర్మవీర్ చక్ర అవార్డు
ABN , First Publish Date - 2021-04-29T12:42:38+05:30 IST
జాతీయస్థాయి పురస్కారం కర్మవీర్ చక్ర అవార్డు. కొన్నేళ్లుగా యూత్ పార్లమెంట్ కార్యక్రమాల ద్వారా ...

హైదరాబాద్ సిటీ : నగరానికి చెందిన సామాజిక కార్యకర్త రాఘవేందర్ ఆస్కానీకి ప్రతిష్ఠాత్మకమైన రెక్స్ కర్మవీర్ చక్ర అవార్డు లభించింది. భావి తరాల కోసం మెరుగైన ప్రపంచం సృష్టించాలని తపిస్తూ కృషి చేసే సంస్థలు, వ్యక్తులను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి(యూఎన్) భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవో(ఐకాంగో) అందిస్తోన్న జాతీయస్థాయి పురస్కారం కర్మవీర్ చక్ర అవార్డు. కొన్నేళ్లుగా యూత్ పార్లమెంట్ కార్యక్రమాల ద్వారా సిటిజన్స్ చార్టర్ బిల్లు, నూతన జాతీయ విద్యావిధానం, వ్యవసాయ విధానం వంటి వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన అంశాల ద్వారా గణనీయమైన ప్రభావాన్ని చూపినందుకుగాను రాఘవేందర్‌కు ఈ అవార్డు అందజేశారు. ఈ-రెక్స్ గ్లోబల్ యూత్ ఫెలోషిప్‌ను సైతం ఆయన అందుకున్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ఆయనకు ఐ కాంగో ప్రతినిధులు అందజేశారు.