హైదరాబాద్: ఎల్బీస్టేడియంలో కోచ్‌ల ఆందోళన
ABN , First Publish Date - 2021-04-06T19:10:45+05:30 IST
ఎల్బీస్టేడియం శాట్స్ కార్యాలయం వద్ద కోచ్‌లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: ఎల్బీస్టేడియం శాట్స్ కార్యాలయం వద్ద కోచ్‌లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శాట్స్ ఒప్పంద కోచ్‌లు దర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. తమను శాట్స్ చైర్మన్ పట్టించుకోవట్లేదన్నారు. 28 ఏళ్లుగా శాట్స్ ఒప్పంద కోచ్‌లుగా పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కోచ్‌ల నియామకం, అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, జీతాల పంపిణీ శాట్స్ ద్వారా జరగాలన్నారు. తమ సమస్యలపై క్రీడా మంత్రి, శాట్స్ చైర్మన్ స్పందించడంలేదని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు.