రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2021-01-25T03:34:20+05:30 IST
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి తన వంతు సాయం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

దేవరకద్ర, జనవరి24: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి తన వంతు సాయం చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆదివారం దేవరకద్ర పట్టణంలో ఇంటింటా తిరుగుతూ రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణానికి తనవంతు బీజేపీ నాయకుడు డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి రూ.5లక్షల విరాళాన్ని డీకే అరుణకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మం డల అధ్యక్షుడు కొండ అంజన్‌కుమార్‌రెడ్డి, నాయ కులు సాయిరాజ్, యజ్ఞ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో..
మూసాపేట: రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రమైన మూసాపేట, వేముల, నిజాలాపూర్, సంకలమద్ది, నందిపపేట, దాసరిపల్లి, జానంపేట, కొమిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విరాళాల సేకర ణ చేపట్టారు. బైక్ ర్యాలీ నిర్వహించారు.
కొనసాగుతున్న విరాళాల సేకరణ
రాజాపూర్: రామ మందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణ కొనసాగుతోంది. ఈ సందర్భం గా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రామమందిర నిర్మాణంలో భాగస్వాము లు కావాలన్నారు. కార్యక్రమంలో గంగాధర్‌గౌడ్, శ్రీకాంత్, నాగేందర్, నాగేష్‌రెడ్డి, ఆకాష్, భరత్, నాగతేజ, ఆంజనేయులు పాల్గొన్నారు.
నిధి సేకరణకు చక్కటి స్పందన
భగీరథకాలనీ, జనవరి 24: అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి ప్రతీ ఒక్కరి నుంచి చక్కటి స్పందన వస్తోందని బీజేపీ నాయకుడు ఎస్.పాండురంగారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో కాలనీవాసులతో కలిసి ఆయన నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం, రాముని జీవితం సర్వత్రా ఆచరణీయమని అన్నారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్లాల్ రూ.10,116 నిర్మాణ నిధికి విరాళమిచ్చారు. కార్యక్ర మంలో బాలకిష్టారెడ్డి, నిరంజన్‌రావు, ఆంజనేయులు, రవికుమార్ పాల్గొన్నారు.
విరాళలు అందించాలి
మహభూబ్‌నగర్ రూరల్: అయోధ్య రామునికి అందరూ విరాళలు అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి అన్నారు. ఆదివా రం మండలంలోని ధర్మపూర్ గ్రామంలో అయోధ్య రామ నిర్మణానికి సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి నిధి సేకరణ చేశారు. దైవర కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కృష్ణవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ రవీం దర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇంబ్రాహీంబాద్లో నిధుల సేకరణ
హన్వాడ: రామందిరం నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా నాయకుడు బుచ్చి రెడ్డి, మండల నాయకుడు వెంకటయ్యలు అన్నారు. ఆదివారం మండలంలోని ఇంబ్రాహీంబాద్లో నిధు ల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో వెంకటయ్య, నారాయణ, కేశవులు, సుదర్శన్‌రెడ్డి, అంజిరెడ్డి, పుల్లయ్య పాల్గొన్నారు.
ప్రజలంతా భాగస్వాములవ్వాలి
మిడ్జిల్: రామమందిర నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లోని హిందూవాహిని, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కంచనపల్లిలో సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిధి సేకరణ పత్రాలను గ్రామస్థులకు అందజేశారు. కార్యక్రమంలో తిరుపతి, విష్ణువర్ధన్‌రెడ్డి, కరుణాకర్, జనార్దన్‌రెడ్డి, మన్యంరెడ్డి, యాదయ్య, కుమార్‌గౌడ్, రమేష్‌గౌడ్, అరవింద్, రాము, శేఖర్, బాలకిష్టయ్య, నర్సింహ, నరేష్, బాలస్వామి పాల్గొన్నారు.