మల్దకల్‌లో ఉత్సాహంగా సందెరాళ్ల పోటీలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:51 PM
మల్దకల్ మండ ల కేంద్రంలోని వాల్మీకి గుడి వద్ద యూత్ కమి టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సందె రాళ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి.

మల్దకల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మల్దకల్ మండ ల కేంద్రంలోని వాల్మీకి గుడి వద్ద యూత్ కమి టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సందె రాళ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీ లకు వివిధ గ్రామాలకు చెందిన యువకులు 90, 95 కేజీల రాళ్లు ఎత్తే పోటీల్లో పాల్గొన్నారు. మొదటి బహుమతి ఉప్పరి నరేశ్ (95 కేజీల బరువు), రూ.3వేల నగదు, రెండవ బహుమతి ఎద్దులోనిబాయి బుచ్చన్నకు రూ.2వేలు నగదు బహుమతులను వాల్మీకి సంఘం నాయకుడు పి.తిమ్మప్ప అందజేశారు. కార్యక్రమంలో యూత్ కమిటీ యూత్ నాయకులు, గ్రామస్థులు ఉన్నారు.