Share News

కంకర తేలిన రోడ్డుతో ఇబ్బందులు

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:26 PM

మండలంలోని పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కంకర తేలిన రోడ్డుతో ఇబ్బందులు
దోనూర్‌, చౌటకుంటతండా మధ్య కంకర తేలిన రోడ్డు

మిడ్జిల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్లపై అతి కష్టం మీద ప్రయాణాలు సాగిస్తున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రతీ పల్లెకు రోడ్డు, తాగునీరు, విద్యుత్‌ వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పల్లె ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దోనూర్‌, చౌటకుంటతండా గ్రామాల మధ్యన కంకర తేలిన రోడ్డుతో ప్రయాణం నరకయాతనగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం దోనూర్‌ నుంచి చౌటకుంటతండా మీదుగా మండల కేంద్రానికి ప్రజలు వివిధ పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. కానీ మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు మొత్తం కంకర తేలడంతో పలుమార్లు ద్విచక్రవాహనదారులు కిందపడి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:26 PM