రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:19 PM
రైతుల సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్/కృష్ణ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సాయంత్రం మక్తల్‌లోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద, కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామంలో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వరి కొనుగోలుతో పాటు ధాన్యానికి బోనస్ ఇస్తున్నా మన్నారు. ఆర్డీవో రాంచందర్, నాయకులు పాల్గొన్నారు.