పామాయిల్ కంపెనీ పనులను అడ్డుకున్న గ్రామస్థులు
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:42 PM
మండలం లోని సంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న పా మాయిల్ కంపెనీ పనులను ప్రజలు అడ్డుకున్నారు.

కొత్తకోట, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : మండలం లోని సంకిరెడ్డిపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న పా మాయిల్ కంపెనీ పనులను ప్రజలు అడ్డుకున్నారు. పనులకు ఇటీవలి కాలంలో వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శంకుస్థాపన చేశారు. కా గా కంపెనీ ఆదివారం పనులు చేపడుతుండగా.. వి షయం తెలుసుకున్న గ్రామస్థులు పనులు నిలిపి వే యాలని యంత్రాలకు అడ్డుగా నిలిచారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.