Share News

అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:24 PM

అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం
ముస్లింలకు పండ్లు తినిపిస్తున్న ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

- నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

కోయిలకొండ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పెద్ద మజీద్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో పాల్గొని, ముస్లింలకు పండ్లు తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట కాంగ్రెస్‌ నాయకులు కే.శివకుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అఽధ్యక్షుడు రవీందర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ విద్యాసాగర్‌గౌడ్‌, నాయకులు సత్యపాల్‌రెడ్డి, జగన్‌గౌడ్‌, రవినాయక్‌, శేఖర్‌, రామస్వామి, మైనార్టీ నాయకులు గౌస్‌, అజెల్లీ, యూనుస్‌ పాల్గొన్నారు.

పండుగలు ఐక్యతకు ప్రతీకలు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : పండుగలు ఐక్యతకు ప్రతీకలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జామియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్‌ముదిరాజ్‌, ఎన్పీ వెంకటేశ్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, డీసీసీ కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, ఉపాఽధ్యక్షుడు చంద్రకుమార్‌గౌడ్‌, వన్‌టౌన్‌ సీఐ అప్పయ్య, ఎస్‌ఐ సీనయ్య, సర్దార్‌, జకీ, అహ్మద్‌సనా, రఫీక్‌పటేల్‌, మోసీన్‌ఖాన్‌, ఖుద్దుస్‌బేగ్‌, సమాద్‌ఖాన్‌, కలీం, ఇబ్రాహీంఖాద్రీ పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:24 PM