AP News: సుప్రీం మధ్యంతర ఉత్తర్వులపై వైసీపీ నేతల హర్షం

ABN , First Publish Date - 2022-11-28T17:49:05+05:30 IST

Ambati Ram babu: ఏపీ రాజధాని అంశంపై కొన్ని సంవత్సరాలుగా సందిగ్ధం నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(TDP), ఇతర పార్టీలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. కాని

AP News: సుప్రీం మధ్యంతర ఉత్తర్వులపై వైసీపీ నేతల హర్షం

Ambati Ram babu: ఏపీ రాజధాని అంశంపై కొన్ని సంవత్సరాలుగా సందిగ్ధం నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(TDP), ఇతర పార్టీలు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. కాని వైసీపీ(YCP) ప్రభుత్వం అందుకు భిన్నంగా మూడు రాజధానుల ప్రస్తావన తెరమీదకు తెచ్చింది. మరో వైపు అమరావతి రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల నిర్ణయంపై గతంలో హైకోర్టు భిన్నంగా స్పందించింది. దీంతో ప్రభుత్వం సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై వైసీపీ నేతలు స్పందించారు. మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పలువురు మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందేమోనని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణకు బలాన్ని చేకూర్చేలా సుప్రీం ఉత్తర్వులు ఉన్నాయని, రాజధాని నిర్మాణం, నిర్ణయం ప్రభుత్వాల బాధ్యత అని సుప్రీంకోర్టు గుర్తుచేసిందని చెప్పారు. ‘ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉంది. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని సుప్రీం కోర్టు భావించింది. అందుకు సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది’ అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పేర్కొన్నారు.

Updated Date - 2022-11-28T17:49:15+05:30 IST