నడివీధిలో మయూరనాట్యం
ABN , First Publish Date - 2022-04-15T07:14:34+05:30 IST
89పెద్దూరు గ్రామంలోకి గురువారం ఉదయం అడవిలోంచి ఒక నెమలి వచ్చి వాలింది.

రామకుప్పం: రామకుప్పం మండలం 89పెద్దూరు గ్రామంలోకి గురువారం ఉదయం అడవిలోంచి ఒక నెమలి వచ్చి వాలింది. నెమ్మదిగా నడుచుకుంటూ వీధుల్లో తిరిగింది. ఒక ఇంటి ముందు ఆగి ఇలా పురివిప్పి నాట్యమాడింది. ప్రజలంతా సంబ్రమంగా చూశారు. కాసేపటికి నెమలి సమీప అడవిలోకి వెళ్ళిపోయింది.